Siva Balaji:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే, కచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA)లో ఫిర్యాదు చేస్తారు. ముఖ్యంగా తమకు ఏదైనా కష్టం వస్తే, ఇండస్ట్రీ అండగా ఉంది అని వారి ధైర్యం. ఈ క్రమంలోనే ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా జెసి దివాకర్ రెడ్డి(JC. Diwakar Reddy ) మాధవీలత (Madhavi latha ) పై చేసిన కామెంట్లకు హర్ట్ అయిన ఆమె, నేడు మా అసోసియేషన్లో ఫిర్యాదు చేసింది. ఇకపోతే ఈ విషయంపై మాట్లాడిన శివ బాలాజీ (Siva balaji ) ఇండస్ట్రీలో మహిళల గురించి, ఎవరైనా తప్పుగా మాట్లాడితే.. కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. మాధవి లత ఎంత హర్ట్ కాకపోతే ఆమె ‘మా’ కి కంప్లైంట్ ఇస్తుంది.. అందుకే ఆమె కంప్లైంట్ పై విచారణ చేపట్టినట్లు మా అసోసియేషన్ ట్రెజరర్ శివ బాలాజీ కామెంట్స్ చేశారు.
పూనమ్ ఫిర్యాదును లైట్ తీసుకుంటున్నాం..
ఇక అదే సమయంలో నటి పూనమ్ కౌర్ (Poonam kaur ) ఫిర్యాదును లైట్ తీసుకుంటున్నామంటూ కామెంట్లు చేయడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ (Trivikram) తనను చాలా ఇబ్బంది పెడుతున్నాడని, ఎన్నోసార్లు మా అసోసియేషన్లో కంప్లైంట్ చేసినా.. తనకు న్యాయం జరగలేదని, గతంలో పూనమ్ ట్వీట్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన శివబాలాజీ వెంటనే మా అసోసియేషన్ కి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. దయచేసి మీకు వచ్చిన సమస్యను లెటర్ రూపంలో అందివ్వగలరు అంటూ కోరారు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ..పూనమ్ కౌర్ ఇష్యూను లైట్ తీసుకుంటున్నాం.. పూనం కౌర్ విషయాన్ని మా అసోసియేషన్ పట్టించుకోవడం లేదు. లైట్ తీసుకుంటుంది మా అసోసియేషన్ కి పూనమ్ ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు. కాబట్టే ఆమె విషయాన్ని లైట్ తీసుకుంటున్నాము అంటూ తెలిపారు శివ బాలాజీ. ఇకపోతే గతంలో ఇప్పటికే పలుమార్లు సినీ పెద్దలపై పూనమ్ కౌర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ పలు పోస్టులు పెట్టిన పూనమ్ కౌర్..
గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ పూనమ్ వరుస పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు పేరు ప్రస్తావించని పూనమ్ కౌర్ ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ పేరును బయటకు తీస్తూ పోస్టులు పెడుతోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ వల్లే తన జీవితం నాశనం అయ్యిందంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.దీంతో త్రివిక్రమ్ ఈమెను ఏం చేశాడు? ఎందుకు ఇలాంటి పోస్ట్లు పెడుతోంది? అనే విషయాలపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. దీనికి తోడు కంప్లైంట్ ఇవ్వకుండానే మా అసోసియేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడంలేదని పోస్ట్ పెట్టింది. దీనితో మా ట్రెజరర్ శివబాలాజీ స్పందిస్తూ.. ఆమె మా అసోసియేషన్ కి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. అందుకే ఆమె ఫిర్యాదును మేము లైట్ తీసుకుంటున్నాం అంటూ తెలిపారు. మరి దీనిపై పూనమ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.