BigTV English

Harbhajan Singh: మొగుళ్లు తప్పు చేస్తే.. పెళ్లాలకు రూల్స్ ఎందుకు ? బీసీసీఐపై భజ్జీ ఫైర్ !

Harbhajan Singh: మొగుళ్లు తప్పు చేస్తే.. పెళ్లాలకు రూల్స్ ఎందుకు ? బీసీసీఐపై భజ్జీ ఫైర్ !

Harbhajan Singh: భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల పనితీరును మెరుగుపరచడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్ లో ఓటమిపై సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత జట్టులో క్రమశిక్షణను పెంచడానికి బీసీసీఐ 10 మార్గదర్శకాలను జారీ చేసింది.


Also Read: Women’s U 19 T20 World Cup: నేటి నుంచి U19 మహిళల టీ20 WC.. టైమింగ్స్‌, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే ?

ఆటగాళ్లు ఈ రూల్స్ ని కచ్చితంగా పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. బీసీసీఐ మార్గదర్శకాలలో ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యుల ప్రయాణం పై ఆంక్షలు విధించారు. విదేశీ పర్యటనలకు ఆటగాళ్లు తమ కుటుంబాలతో ఎన్నిసార్లు ప్రయాణించవచ్చనే దానిపై పరిమితి విధించింది. ఒక ఆటగాడి కుటుంబం అతనితో రెండు వారాలపాటు పర్యటనలో ఉండవచ్చు. దీనికి బీసీసీఐ వసతి మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన ఖర్చులను ఆటగాడే స్వయంగా భరించాల్సి ఉంటుంది.


గతంలో విదేశాలకు కుటుంబంతో సహా వెళ్లేందుకు క్రికెటర్లకు అనుమతి. పెళ్లి కానీ క్రికెటర్లు భార్యా, పిల్లలకు బదులు ప్రియురాళ్లతో ఫారిన్ టూర్లకు వెళ్లేవారు. అయితే ఈ కొత్త ప్రోటోకాల్ కారణంగా భార్యా పిల్లలకు దూరంగా నెలల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఆస్ట్రేలియాపై భారత్ 3-1 తో టెస్ట్ సిరీస్ ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఈ నిబంధనలను తీసుకువచ్చింది. అయితే బిసిసిఐ తీసుకువచ్చిన ఈ కొత్త 10 నిబంధనలపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు.

బీసీసీఐ ప్రధాన సమస్యను పక్కనపెట్టి.. పనికిరాని అంశంపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోందన్నాడు. ” కేవలం పెళ్ళాలు, పార్ట్నర్స్ ఉండడంవల్ల ఆస్ట్రేలియాతో {India-Australia test series} టెస్ట్ సిరీస్ ని 3 – 1 తేడాతో ఓడిపోలేదు. రెండు నెలల పాటు భార్యా, పిల్లలకు దూరంగా ఉండమని చెప్పడం కూడా సరైంది కాదు. అలా అని వేరే వాళ్ళు భార్యలను వదిలేసి సింగిల్ గా వచ్చి గెలిచారని చెప్పడానికి లేదు. మన జట్టు ఓటమికి కారణం చెత్తగా ఆడటం మాత్రమే.

మధ్యలో భార్యలు ఏం చేశారు. మన ఆట తీరు బాలేక భార్యలను నిందించడం ఎందుకు. స్వదేశంలో జరిగిన సిరీస్ లో కూడా మన జట్టు సరిగ్గా ఆడలేకపోయింది. ఆటగాళ్లు సరైన ఫామ్ లో లేరు. ముందు వారు ఫామ్ పై ఫోకస్ చేయాలి. మా రోజుల్లో మ్యాచ్ మ్యాచ్ కి మధ్య ఎక్కువ సమయం దొరికితే.. సచిన్ టెండుల్కర్ ముంబైకి, వివిఎస్ లక్ష్మణ్ హైదరాబాద్ కి, సౌరవ్ గంగూలీ కోల్కత్తా కి, రాహుల్ ద్రావిడ్ బెంగళూరుకి వెళ్లిపోయే వాళ్ళు కాదు.

Also Read: Pakistan Stadium: పాకిస్థాన్ స్టేడియంపై ట్రోలింగ్.. బాత్రూంలో వాడే కుర్చీలంటూ ?

పూర్తి సిరీస్ ముగిసే వరకు జట్టుతోనే ఉండేవాళ్లం. మ్యాచ్ మూడు రోజులలో ముగిసిపోతే.. వేరే మ్యాచ్ జరిగే వేదిక దగ్గరికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవాళ్లం. కానీ నేను చూసిన మార్గదర్శకాల్లో 150 కేజీల లగేజీ మాత్రమే తీసుకువెళ్లాలన్న నిబంధన కొత్తగా అనిపించింది. ఏది ఏమైనా జట్టు ఆటగాళ్లు వారి ప్రదర్శన పై ఫోకస్ చేయాలి” అని సూచించారు హర్భజన్ సింగ్.

Related News

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Pakistan Cricketer : ఇంగ్లాండ్ ను ఓడించేందుకు వాజిలిన్ వాడారు…. భారత బౌలర్ల పై పాక్ సంచలన ఆరోపణలు

Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Jasprit Bumrah: టీమిండియాకు దరిద్రంగా మారిన బుమ్రా.. అతడు ఆడితే ఓటమే.. ఇదిగో లెక్కలు!

Big Stories

×