BigTV English

Siva Balaji: విడాకులకు సిద్ధమైన శివబాలాజీ.. ఒక్క మాటతో క్లారిటీ..!

Siva Balaji: విడాకులకు సిద్ధమైన శివబాలాజీ.. ఒక్క మాటతో క్లారిటీ..!

Siva Balaji: టాలీవుడ్ లో శివ బాలాజీ, మధుమిత జంటకు వెండితెర పైనే కాదు.. బుల్లితెరపై కూడా ఎంతో క్రేజ్ ఉందని చెప్పొచ్చు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శివ బాలాజీ బిగ్ బాస్ తెలుగు సీజన్1 విజేతగా నిలిచారు. విలక్షణమైన నటన, వినూత్నమైన క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను అలరించారు. మధుమిత తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి ప్రేమ కథ ఓ సినిమా సెట్ లో ప్రారంభమై, బలమైన బంధంగా మారి, 2009లో వివాహం చేసుకున్నారు. బిగ్ బాస్ తర్వాత వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిపై ఎన్నోసార్లు ఈ జంట స్పందించడం జరిగింది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివ బాలాజీ మధుమిత వారి పై వస్తున్న విడాకుల రూమర్స్ కి సమాధానం ఇచ్చారు.


ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన శివ బాలాజీ ..

యాక్టర్ శివ బాలాజీ, మధుమిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలలో నటించి మెప్పించారు. టాలీవుడ్ లో అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో వారి వ్యక్తిగత విషయాలతో పాటు, వారి విడాకుల రూమర్స్ పై స్పందించారు. మీ ఇద్దరు విడిపోతున్నట్లు ఎన్నో వీడియోస్ లో థంబ్ లైన్ వేయడం చూసాము.. దానిపై మీరేం అంటారు అని యాంకర్ అనగా మధుమిత మాట్లాడుతూ… నేను ఈరోజు అసలు ఈ టాపిక్ మాట్లాడకూడదు అనుకున్నాను. మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, ఇలాంటి థంబ్ లైన్స్ ఎన్ని పెట్టి వీడియోస్ చేసిన, మేము స్ట్రాంగ్ గా నిలబడగలం. కానీ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. నిజమని మాకు కాల్స్ చేస్తారు. ఎప్పుడైతే ఒక వీడియో బయటకి వచ్చిందో.. అది వైరల్ అవ్వగానే ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది. నిన్నటిదాకా బాగున్నారు. ఈరోజు ఏంటి ఇలా అని మా ఫ్యాన్స్, ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతుంటారు. అది నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది. అది నాకు అస్సలు నచ్చదు. ఎందుకు హ్యాపీగా ఉన్న ఫ్యామిలీని అలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు. చూసే ప్రతి ఒక్కళ్ళు కొంచెం రెస్పాన్స్ అవ్వాలి. అలాంటి థంబ్ లైన్ పెట్టి వీడియో రాగానే దాన్ని చూడకుండా ఉంటే ఇంకొకసారి ఇలా ఎవరు వీడియో చేయరు. మనం ఏంటని ఓపెన్ చేసి చూస్తే అది వైరల్ అయి అందరిలోకి వెళ్తుంది అని శివ బాలాజీ వైఫ్ తెలిపింది. వెంటనే శివ బాలాజీ మాట్లాడుతూ.. అసలు ఈ టాపిక్ స్టార్ట్ అవ్వడానికి కారణం, ఒక షోలో ఇలాంటి ప్రశ్న ఒకరు అడిగారు. అప్పుడు నేను ఓపెన్ అయ్యి దీనిపై స్పందించాను. ఈమధ్య ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వెంటనే డైవర్స్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించి బయటికి రావాలి. డైవర్స్ వైపుకు వెళ్ళకూడదు అని నేను ఆ షోలో చెప్పాను. ఆ పాయింట్ తీసుకోకుండా.. మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం చేశారు అని శివ బాలాజీ తెలిపారు. ఈ వీడియో చూసిన వారంతా ఇప్పటివరకు శివ బాలాజీ డైవర్స్ రూమర్స్ పై గట్టిగా సమాధానం చెప్పారు అని తెలిపారు.


నూతన జంటలకు మా సలహా ..

మీరు కొత్తగా పెళ్లయిన వారికి ఇచ్చే సలహా ఏమిటి అని అడగ్గా… వారు మాట్లాడుతూ.. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలి. ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే ఎవరి దారి వారు చూసుకోవాలి. మనం తల్లిదండ్రులతో కొన్ని సంవత్సరాలు జీవిస్తాం. ఆతర్వాత మిగిలిన జీవితం అంతా భాగస్వామితోనే గడుపుదాం. నచ్చకపోతే వదిలేయాలి అనే ఆలోచననీ ముందు బ్రైన్ లో నుంచి తీసేయాలి. ఎలా మన మిగిలిన జీవితాన్ని భాగస్వామితో ముందుకు తీసుకువెళ్లాలి అని ఆలోచించాలి గాని, విడిపోవచ్చు, విడిపోవాలి అనే ఆలోచనలు బ్రెయిన్ లోనుంచి తీసేయాలి అని వారు తెలిపారు. ఇక శివ బాలాజీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఇడియట్, ఆర్య, చందమామ చిత్రాలతో మంచి విజయాలని అందుకున్నారు.

Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో బన్నీ హీరోయిన్… ఇంక ఎంతమంది ఉన్నారయ్య అనిల్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×