BigTV English

Sobhita Dhulipala: అందుకే ఎంగేజ్‌మెంట్ సింపుల్‌గా చేసుకున్నా, తల్లి కావడమే నా కల.. మొదటిసారి ఓపెన్ అయిన శోభితా

Sobhita Dhulipala: అందుకే ఎంగేజ్‌మెంట్ సింపుల్‌గా చేసుకున్నా, తల్లి కావడమే నా కల.. మొదటిసారి ఓపెన్ అయిన శోభితా

Sobhita Dhulipala About Engagement : టాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ల సంఖ్య చాలా తక్కువ. అందుకే నాగచైతన్య, సమంత పెళ్లి అన్నప్పుడు తెలుగు ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యారు. వీరి పెయిర్ చాలా బాగుంటుందంటూ ప్రశంసలు కురిపించారు. అలా ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా వీరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్  అయ్యింది. కానీ వీరిద్దరూ పెళ్లి బంధంలో ఎక్కువకాలం నిలవలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా విడాకుల గురించి ప్రకటించి ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు. ఇక తాజాగా జీవితంలో మరో ముందడుగు వేస్తూ హీరోయిన్ శోభితా ధూళిపాళను నిశ్చితార్థం చేసుకున్నాడు చైతూ. ఆ ఎంగేజ్‌మెంట్‌పై శోభితా మొదటిసారి స్పందించింది.


సింపుల్ ఎంగేజ్‌మెంట్

సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య.. హీరోయిన్ శోభితా ధూళిపాళతో డేటింగ్‌లో ఉన్నాడని రూమర్స్ బయటికొచ్చాయి. వీరిద్దరూ హాలిడేలకు వెళ్లిన ఫోటోలు బయటికి రావడంతో ఇవి రూమర్స్ కాదని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక కొన్నిరోజుల క్రితం నాగచైతన్య, శోభితా సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకొని అందరినీ ఆశ్ఛర్యపరిచారు. అయితే వీరి ఎంగేజ్‌మెంట్ చాలా సింపుల్‌గా, ఏ హడావిడి లేకుండా జరిగిపోయింది. కేవలం నాగచైతన్య, శోభితా కుటుంబ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. అంతే కాకుండా వీరిద్దరూ కూడా చాలా సింపుల్‌గా రెడీ అయ్యారు. అంత సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం వెనుక కారణమేంటో శోభితా బయటపెట్టింది.


Also Read: ఫ్యాన్ వార్స్ ఆపండి, అలా అని మాట ఇవ్వండి.. ఎన్‌టీఆర్ అభిమానులకు ‘దేవర’ టీమ్ రిక్వెస్ట్

అదే పర్ఫెక్ట్

‘నేను నా ఎంగేజ్‌మెంట్ గురించి ఎప్పుడూ గ్రాండ్‌గా కలలు కనలేదు. పెద్దగా ప్లానింగ్ కూడా చేయలేదు. నేను ఆ మూమెంట్‌లో ఉండిపోవాలని అనుకున్నాను అంతే. మా ఎంగేజ్‌మెంట్ నాకు చాలా రిలాక్స్‌గా అనిపించింది. నేను ఎలా జరగాలి అనుకున్నానో అలాగే జరిగింది. మంచి విషయాలు జరిగినప్పుడు వాటికి అనవసరమైన హంగులు అవసరం లేదు. ఆ సంతోషమే నా మనసు నిండిపోయేలా చేస్తుంది. అది సింపుల్‌గా ఉందా లేదా అని నేను ఆలోచించలేదు. అదే నాకు పర్ఫెక్ట్ అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది శోభితా. ఆగస్ట్ 9న తను నాగచైతన్యను ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అందులో చైతూ సింపుల్ కుర్తాలో కనిపించగా.. శోభితా ఒక పింక్ లెహెంగాలో కనువిందు చేసింది.

తల్లి కావాలనుకున్నా

చాలా మంది నటీనటులకు పెళ్లి మీద మంచి అభిప్రాయం ఉండదు. కానీ శోభితా మాత్రం అలా కాదు. తను పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం గురించి కలలు కనేదాన్ని అని బయటపెట్టింది. ‘‘నేను తల్లి కావాలని, ఆ అనుభవాన్ని పొందాలని అనుకుంటూ ఉండేదాన్ని. ఆ విషయంలో నేను క్లియర్‌గా ఉండే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేనెప్పుడు నన్ను ఒక ఫ్యామిలీతోనే ఊహించుకున్నాను. పైగా అలాంటి సందర్భాల్లో తెలుగుదనం ఉట్టిపడాలని అనుకున్నాను. నేను నా ఆచారాలకు, నా తల్లిదండ్రులకు అటాచ్ అయ్యి ఉంటాను’’ అని తెలిపింది శోభితా. ఇక నాగచైతన్య, శోభితా పెళ్లి తేదీ గురించి ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×