Sobhita Dhulipala Wedding Jewelry: సినీ సెలబ్రిటీల్లో ప్రేమించి పెళ్లి చేసుకునే హీరోహీరోయిన్ల సంఖ్య చాలా తక్కువ. తెలుగులో అయితే అలా పెళ్లి చేసుకున్న వారు చాలా తక్కువమందే ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి నాగచైతన్య (Naga Chaitanya), శోభితా (Sobhita) యాడ్ అవ్వనున్నారు. అందుకే డిసెంబర్‌లో జరగనున్న వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రేక్షకులంతా అసలు వీరి పెళ్లి ఎలా జరుగుతుంది అనే చర్చించుకుంటున్నారు. అయితే ఎంగేజ్‌మెంట్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభితా.. అసలు తన పెళ్లి ఎలా ఉండబోతుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఏడు వారాల నగలతో పెళ్లిలో సందడి చేయడానికి సిద్ధం కానుందట ఈ ముద్దుగుమ్మ.
ఎంతో క్లారిటీ
నాగచైతన్య, శోభితా.. ఇద్దరూ తెలుగువాళ్లే. అందుకే ఈ పెళ్లి పూర్తిగా తెలుగు పద్ధతిలో, ఆచారాలతో జరగనుందనే విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక శోభితా కూడా తనకు పూర్తిగా తెలుగు స్టైల్‌లో పెళ్లి చేసుకోవడమే ఇష్టమని బయటపెట్టింది. అందుకే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ట్రెడీషినల్‌గా జరిగింది. ఇప్పుడు వివాహం కోసం కూడా అలాంటి ప్లాన్‌నే తయారు చేశారట నాగచైతన్య, శోభితా. ముఖ్యంగా శోభితా అయితే తన పెళ్లి చీర దగ్గర నుండి నగల వరకు అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా ఉందని, తను ఎలా రెడీ అవ్వాలో పూర్తిగా క్లారిటీ ఉందని అర్థమవుతోంది. పైగా తన పెళ్లిరోజు కోసం తను ట్రెడీషినల్ జ్యువలరీనే ఎంపిక చేసుకోనుందట.
Also Read: నయనతారపై సివిల్ కేస్.. వదిలిపెట్టేది లేదంటూ..?
అవన్నీ ధరించి
జ్యువలరీలో ఎన్నో రకాలు ఉంటాయి. పైగా రోజురోజుకీ అందరిలో మారుతున్న టేస్ట్‌ను బట్టి జ్యువలరీ స్టైల్స్ కూడా మారుతూ ఉన్నాయి. అందుకే ఈరోజుల్లో పెళ్లి చేసుకునేవారు ఎక్కువగా ఈ మోడర్న్ జ్యువలరీకే ఓట్లు వేస్తున్నారు. కానీ శోభితా అలా కాదు. తన పెళ్లి కోసం పూర్తిగా ట్రెడీషినల్ జ్యువలరీ సిద్దం చేసి పెట్టుకుందని సన్నిహితులు చెప్తున్నారు. నాగచైతన్యతో జరగనున్న పెళ్లిలో ఇద్దరూ బాసికాలు పెట్టుకొని ఉంటారని తెలుస్తోంది. నుదుటిపై సూర్య చంద్రుడి తిలకాలు, తలపై మాథపట్టి, చేతికి వంకీ, వడ్డాణం.. లాంటి నగలను తన పెళ్లి కోసం సెలక్ట్ చేసుకుందట శోభితా. దీన్ని బట్టి చూస్తే నాగచైతన్య, శోభితా అచ్చమైన తెలుగింటి పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.
బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం
ఈరోజుల్లో చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నా అందులో చాలావరకు నేటి ట్రెండ్‌కు తగినట్టే జరుగుతున్నాయి. కానీ వారి పెళ్లి మాత్రం కచ్చితంగా అన్ని పద్ధతులను పాటిస్తూ జరగాలని నాగచైతన్య, శోభితా డిసైడ్ అయినట్టున్నారు. ఇక శోభితా నగలతో పాటు తాజాగా ఈ పెళ్లి గురించి మరొక ఆసక్తికర విషయం బయటికొచ్చింది. తెలుగు బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి 8 గంటల పాటు జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 4న నాగచైతన్య, శోభితా వివాహ బంధంలో ఒక్కటవ్వనున్నారు. ఇప్పటికే దీనికి కావాల్సిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయట.