BigTV English

Khaleja4K : కన్ఫ్యూజింగ్ ఖలేజా, సీన్స్ లేపేసారా.? ఇలా అయితే కష్టం గురు

Khaleja4K : కన్ఫ్యూజింగ్ ఖలేజా, సీన్స్ లేపేసారా.? ఇలా అయితే కష్టం గురు

Khaleja4K : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాగా పాపులర్ అయిన కాంబినేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ఖలేజా. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బాక్స్ ఆఫీస్ సాధించలేకపోయింది. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అని ఈ సినిమా డైలాగు లాగానే రిజల్ట్ కూడా తయారైంది. ఇప్పుడు ఈ సినిమాకి ఉన్న ఫ్యాన్ బేస్ మామూలుది కాదు. ఈ సినిమాను మ్యూట్లో పెట్టి మరి డైలాగ్స్ చెప్పే అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన సందర్భంగా ఈ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేశారు.


కొన్ని సీన్స్ మిస్సింగ్ 

హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ కి ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ థియేటర్ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే హీరో మహేష్ బాబు. ఈ థియేటర్ కి మహేష్ బాబుకి ఒక అవినాభావ సంబంధం ఉంది. మహేష్ బాబు సినిమాలు ఈ థియేటర్లోనే చాలామంది చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఖలేజా సినిమా ఈరోజు నుంచి షోస్ వేయడం మొదలుపెట్టారు. ఈ సినిమాలోని చాలా వరకు సీన్స్ కట్ అయ్యాయి అంటూ కంప్లైంట్ వినిపిస్తుంది. అలానే సాంగ్స్ కూడా కట్ అయినట్లు తెలుస్తుంది. దీనితో అభిమానులంతా థియేటర్ యాజమాన్యంతో గొడవ పడటం మొదలుపెట్టారు. అయితే థియేటర్ యాజమాన్యం ప్రింట్ ఇలానే వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.


ఇలా అయితే కష్టమే 

ఖలేజా సినిమా విషయానికి వస్తే చాలామందికి ఫేవరెట్ ఫిలిం అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సీను కూడా చాలామంది ఆడియన్స్ కు రిజిస్టర్ అయి ఉండిపోయింది. ఏ సీను కట్ అయిన రచ్చ చేయడం ఖాయం. అంతగా ఆ సినిమా జెమినీ టీవీలో టెలికాస్ట్ కావడం వలన కావచ్చు, పదేపదే యూట్యూబ్లో చూడడం వలన కావచ్చు ఆడియన్స్ అందరికీ గుర్తుండిపోయింది. ఉన్న సినిమాను ఉన్నఫలంగా రిలీజ్ చేస్తేనే మంచి రిజల్ట్ మరియు కలెక్షన్లు వస్తాయి. మళ్లీ జిమిక్కులు చేశారంటే ఈ సినిమాను ఈసారి కూడా కాపాడటం కష్టమే. ఇక రేపటి నుంచి చాలా చోట్ల ఈ సినిమా ప్రదర్శించబడుతుంది కాబట్టి రేపటితో సరైన క్లారిటీ వస్తుంది.

Also Read : Krishna Vamsi : సురేష్ బాబు వెంకటేష్ ను ఇస్తా అన్నా కూడా, నేను చక్రవర్తి తోనే తీస్తా అన్నాను

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×