Sonakshi Sinha : నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’. ఇది ఆయన 107వ చిత్రం. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. అయితే ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే బాలయ్య తన 108వ సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 8న NBK 108 స్టార్ట్ కానుంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వారం రోజుల షూటింగ్ చేసిన తర్వాత నెక్ట్స్ షెడ్యూల్ కోసం గ్యాప్ తీసుకున్ని నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాను పూర్తి చేస్తారు. కాగా.. NBK 108 సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తుందని కొన్నాళ్ల ముందు నెట్టింట వార్తలు వినిపించాయి. రీసెంట్‌గా అయితే సోనాక్షి సిన్హాను పక్కన పెట్టేశారని కూడా వార్తలు హల్ చల్ చేశాయి.
అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తలపై సోనాక్షి సిన్హా తన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యింది. నా నెక్ట్స్ మూవీని తెలుగులో చేయబోతున్నానని ముందు రాశారు. తర్వాత ఆ సినిమా నుంచి తొలగించేశారని కూడా రాస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదు. ఎందుకంటే ఏ నిర్మాత నన్ను సినిమాలో నటించమని సంప్రదించలేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది సోనాక్షి సిన్హా. NBK 108 సినిమాను షైన్స్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ద నిర్మిస్తున్నారు.