Sreeleela: నెపోటిజం అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉండే నెపోటిజం గురించి మాత్రం అంతటా హైలెట్ అవుతుంది. యాక్టింగ్ రాకపోయినా కేవలం స్టార్ హీరో లేదా హీరోయిన్ వారసులు అని పేరుతోనే ఇండస్ట్రీలోకి ఈజీగా ఎంటర్ అవుతారు అంటూ ఈ నెపో కిడ్స్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన నెగిటివిటీ ఏర్పడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో నెపో కిడ్స్‌పై మరింత నెగిటివిటీ ఉంది. దానివల్లే టాలెంటెడ్ యాక్టర్లకు అవకాశాలు రావడం లేదని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా టాలీవుడ్‌లో మల్టీ టాలెంటెడ్ అని పేరు తెచ్చుకున్న శ్రీలీలకు కూడా బాలీవుడ్ వెళ్లగానే ఎదురుదెబ్బ తగిలింది. అప్పుడే తన చేతిలో నుండి ఒక అవకాశం జారిపోయింది.
అవకాశం చేజారింది
శ్రీలీల టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టినప్పటి నుండి తన డ్యాన్స్‌తో, యాక్టింగ్‌తో విపరీతంగా ఆకట్టుకుంది. అంతే కాకుండా మల్టీ టాలెంటెడ్ అని పేరు కూడా తెచ్చుకుంది. అందుకే హీరోయిన్‌గా పరిచయమయిన కొన్నాళ్లకే మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోతో జోడీకట్టే అవకాశం కొట్టేసింది. అలా శ్రీలీలకు టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. అయినా కూడా చాలామంది ఇతర హీరోయిన్స్‌లాగానే తను కూడా బాలీవుడ్‌పై ఆశలతో అటువైపు దృష్టిపెట్టడం మొదలుపెట్టింది. కార్తిక్ ఆర్యన్ లాంటి యంగ్ హీరోతో కలిసి బీ టౌన్‌లో డెబ్యూ చేయడానికి సిద్ధమయ్యింది. అయితే ఇంతలోనే తనకు మరో హిందీ మూవీలో అవకాశం ఇలా వచ్చి అలా వెళ్లిపోయిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
కావాలనే తప్పించారా.?
ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్, శ్రీలీల జంటగా ‘ఆషిఖీ 3’ సినిమా తెరకెక్కుతోంది. అనురాగ్ బసు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. దీనికంటే ముందే కార్తిక్ ఆర్యన్‌తో రెండు సినిమాల కాంట్రాక్ట్‌ను సైన్ చేసిందట శ్రీలీల. ఆ మరో సినిమానే ‘పతీ పత్నీ ఔర్ వో 2’. అయితే అంతా ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను పక్కకు తప్పించి రవీనా టండన్ కుమార్తె రాషా తడానీ (Rasha Thadani)ని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట మేకర్స్. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలీల ఛాన్స్‌ను ఒక నెపో కిడ్ కొట్టేసిందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.
Also Read: ‘శారీ’ మూవీ స్టోరీ లీక్.. ఆర్జీవీ టాలెంట్‌కు మైండ్ బ్లాకే.!
పెయిర్ బాగుంది
ఇప్పటికే కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న ‘ఆషిఖీ 3’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యింది. ఈ గ్లింప్స్‌లోనే తమ కెమిస్ట్రీతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే వీరి పెయిర్ బాగున్నా కూడా ‘పతీ పత్నీ ఔర్ వో’ సీక్వెల్‌లో శ్రీలీల కాకుండా మరొక హీరోయిన్ అయ్యింటే బాగుండేది అని మేకర్స్ ఫీల్ అవుతున్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ విషయానికొస్తే శ్రీలీల స్క్రిప్ట్ సెలక్షన్‌ను తెలుగు ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఇటీవల నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్‌హుడ్’లో శ్రీలీల హీరోయిన్‌గా కనిపించింది. తను వరుసగా అలాంటి పాత్రలే ఎంచుకుంటుందని చాలామంది ఫీలవుతున్నారు. దానివల్ల వరుస ఫెయిల్యూర్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది శ్రీలీల.