Massive explosion: గుజరాత్ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. కాసేపటి క్రితమే రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాలో బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో భవనం పూర్తిగా కుప్పకూలింది.
వివరాల ప్రకారం.. బనస్కాత జిల్లాలోని ధున్వా రోడ్డులో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో ఉన్నట్లుండి.. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో ఫ్యాక్టరీలో కార్మికుల్లో 17 మంది స్పాట్ లోనే చనిపోయారు. ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. భారీ పేలుడు సంభవించడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘోర ప్రమాద సంఘటన గురించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరి కొందరు కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారీ ప్రమాదం జరగటంతో ఇన్ స్పెక్టర్ విజయ్ చౌదరి కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అని ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కార్మికులు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో కార్మికులు మృతిచెందడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరుమున్నీరు పెట్టుకుంటున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం ఆందోళన చెందుతున్నారు. 17 మంది స్పాట్ లో చనిపోవడంతో బనస్కాంత నగరం అంతా విషాదఛయాలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధంచి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Malaysia Fire Accident: మలేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆకాశంలోకి ఎగిసిపడ్డ మంటలు
ALSO READ: JOBS: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. రూ.50,000 జీతం.. ఇంకా 4రోజులే గడువు