Sreeleela: మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా మాస్ జాతర. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. రవితేజ 75 వ సినిమాగా మాస్ జాతర సినిమాగా రానుంది. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ధమాక తర్వాత రవితేజకి మంచి హిట్ సినిమా ఏది పడలేదు. ఎన్నో ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోగా, మాస్ మహారాజుగా రవితేజ టాప్ హీరోల ప్లేస్ లో చేరిపోయారు. వరుస సినిమాలు చేసుకుంటూ బ్రేక్ లేకుండా షూటింగ్లను పూర్తి చేస్తాడు. అనుకున్న దానికంటే ముందుగానే సినిమాలు రిలీజ్ చేయడం రవితేజకే సాటి. ధమాకాలో ఎనర్జిటిక్ డాన్స్ తో అలరించిన శ్రీలీలను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. రవితేజ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమా నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్స్ గా నిర్మిస్తున్నారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్.. ఇందులోని మొదటి సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
గోల్డెన్ సప్రైజ్ లోడింగ్..
మాస్ జాతర సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ‘తూ మేరా లవర్’ సాంగ్ ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోతో ఫాన్స్ కి పిచ్చెక్కించారని చెప్పొచ్చు. ఎవరు ఊహించని విధంగా ఈ సాంగ్ లో పూరి జగన్నాథ్ తో రవితేజ హీరోగా చేసిన ఇడియట్ సినిమాలో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అనే పాట లోని మ్యూజిక్ ని ఈ పాటలో రీ క్రియేట్ చేశారు. ముందు సినిమాలోని బీటును వాడుకోవడం కూడా ఇదే మొదటి సారి అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సినిమా గోల్డెన్ సప్రైజ్ లోడింగ్ ప్రోమోతో ఫాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాలో శ్రీలీల డాన్స్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఏప్రిల్ 14న పాట మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
డాన్స్ మాత్రమే నా..
ఇక శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తున్నా, అందులో చెప్పుకోదగిన హిట్టు ఏదైనా ఉంది అంటే అది గుంటూరు కారం. ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ లో అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సమానంగా స్టెప్పులువేసి ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించింది. పుష్ప2 సినిమాలోని కిసక్ సాంగ్ తో ప్రేక్షకుల మనసు దోచింది. వరుసగా సినిమాలు అయితే చేస్తుంది కానీ, సరైన హిట్ అయితే పడలేదు. ఇలా సాంగ్స్ లో డాన్స్ బాగా చేయడంతోనే సరిపెడుతోంది . అన్ని సినిమాలలో ఒకేలాగా నటన ఉండడం అమ్మడికి అంతగా కలిసి రావట్లేదని చెప్పొచ్చు. రీసెంట్ గా రాబిన్ హూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేదు. ఇప్పుడు ఈ సినిమా పైన ఎక్కువ ఆశలే పెట్టుకుందని చెప్పొచ్చు.
Ramakrishna: 26 ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం అక్కడికి వెళ్ళిన రమ్యకృష్ణ..