BigTV English

Ramya Krishna: 26 ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం అక్కడికి వెళ్ళిన రమ్యకృష్ణ..

Ramya Krishna: 26 ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం  అక్కడికి వెళ్ళిన రమ్యకృష్ణ..

Ramya Krishna: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. తెలుగులో ఆయనకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. రజినీ ఏ సినిమా అయినా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. 2003లో వచ్చిన జైలర్ సినిమాతో రజనీకాంత్ సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. అటు తమిళంలో కాక తెలుగులోనూ 100 కోట్ల వసూలు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది జైలర్. తమిళ్ డబ్బింగ్ సినిమా అయినా తెలుగులోనూ సూపర్ హిట్ అవడం అన్నది రజనీకాంత్ సినిమాలకే సాధ్యం. ఇప్పుడు ఈ సినిమా నుంచి సీక్వెల్ రానుంది. జైలర్ 2 సినిమా నుంచి ఒక అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటన్నది ఇప్పుడు చూద్దాం..


అక్కడికి అన్నేళ్ల తరువాత ..

కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా జైలర్2 సినిమా ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.. జైలర్ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. కళానిధి మారన్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ లో భాగంగా జైలర్ 2 మూవీ టీం కేరళలో సందడి చేశారు. రజనీకాంత్ షూటింగ్ కి వెళ్లే మార్గంలో అభిమానులకు అభివాదం చేశారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రమ్యకృష్ణ షూటింగులో పాల్గొనడం విశేషం. ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు ఫోటో ను రమ్యకృష్ణ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. జైలర్ మొదటి భాగంలో, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ అతిధి పాత్రలలో నటించి మెప్పించారు. జైలర్ 2 సినిమాలో అతిధి పాత్రలో నటించే వారి వివరాలు తెలియాల్సి ఉంది. రమ్య కృష్ణ పోస్ట్ చూసిన తలైవా అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. జైలర్ మొదటి భాగంలో కూడా రమ్యకృష్ణ తలైవా సరసన నటించారు. ఆమె సూపర్ పెర్ఫార్మెన్స్ తో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు జైలర్ 2 సినిమా కోసం షూటింగ్ కి 26 సంవత్సరాల తర్వాత తాను కేరళ వచ్చినట్లు ఈమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్టును అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.


తల్లి పాత్రతో మెప్పిస్తున్న శివగామి ..

టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ బాహుబలి సినిమా తర్వాత, హీరోకి తల్లి క్యారెక్టర్ అంటే రమ్యకృష్ణ మాత్రమే చేయగలరని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలే రమ్యకృష్ణ నటించి మెప్పించారు.మొన్న వచ్చిన గుంటూరు కారం  సినిమా లోను తల్లి పాత్ర లో నటించారు. ఇక తాజాగా రిలీజ్ అయిన సన్నిలియోన్ సినిమా, జాట్ లోను రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు జైలర్ 2 తో మన ముందుకు రాబోతున్నారు. రమ్యకృష్ణ ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురావాలని మనము కోరుకుందాం.

Hebah Patel : ఏంటమ్మా… హీరో ఎవరో తెలియకుండానే… రెండు సార్లు చేశావా..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×