Sree Vishnu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో శ్రీ విష్ణు ఒకరు. వెబ్ డిజైనర్ గా కెరియర్ స్టార్ట్ చేశాడు శ్రీ విష్ణు. బాణం సినిమాతో మెటీరియల్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ప్రేమ, ఇష్క్, కాదల్ సినిమాలో మెయిన్ లీడ్ గా కనిపించి మంచి గుర్తింపును అందుకున్నాడు. ఆ తర్వాత మంచి పేరు వచ్చే పాత్రలు కూడా చేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకుడుగా పరిచయమైన మెంటల్ మదిలో అనే సినిమాతో కంప్లీట్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. వివేక్ ఆత్రేయను కూడా ఒక దర్శకుడిగా ఆ సినిమా నిలబెట్టింది.
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు
శ్రీ విష్ణు కెరియర్ లో మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఉన్నాయి. నీది నాది ఒకే కథ సినిమా చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ సినిమాలో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ తో పాటు దానిలో ఉన్న మెసేజ్, అలానే తండ్రి కొడుకులు మధ్య ఎమోషన్ కూడా అద్భుతంగా వర్కౌట్ చేశాడు దర్శకుడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమాలో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. అప్పటినుంచి చాలామందికి శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ ఏంటో అర్థమైంది. హాసిత్ దర్శకత్వంలో వచ్చిన రాజరాజ చోరా సినిమా కూడా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు శ్రీ విష్ణు కామెడీ కి కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు అని చెప్పాలి.
కొత్త ట్యాగ్ న్యాయం చేశాడు
శ్రీ విష్ణు చేసిన లేటెస్ట్ ఫిలిమ్ సింగిల్. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అని దాదాపు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా చాలామందిని శ్రీ విష్ణు ఇమిటేట్ చేసిన విధానం విపరీతంగా ఆకట్టుకుంది. కొన్ని కాంట్రవర్సీలు జరిగిన కూడా సినిమాకు మంచి పబ్లిసిటీ జరిగింది. ఇకపోతే ఈ సినిమా లో శ్రీ విష్ణు ను రివిల్ చేసినప్పుడు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ట్యాగ్ చేశారు. ఇక సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రశంసలు వస్తున్నాయి. శ్రీ విష్ణుకు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ట్యాగ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సినిమాల్లో కాకుండా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ కూడా శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. ఈ ట్యాగ్ కు ఇమిడిపోయి కాన్సెప్ట్ బేస్ సినిమాలు వదిలేయకుండా ఉంటే అది కూడా శ్రీ విష్ణు కెరియర్ కు ప్లస్ అవుతుంది.
Also Read : Bandla Ganesh: తిరుమల కొండ మీద నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా సినిమాలు తీస్తా