Kerala Tour: కేరళ భూమిపై అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడి ప్రకృతి సౌందర్యం, సంస్కృతి పర్యాటకులను తెగ ఆకర్షిస్తాయి. ఎప్పటికీ పచ్చదనంతో నిండి ఉండే ఈ రాష్ట్రాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో నిత్యం టూరిస్టులు వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి వస్తారు. మీరు కూడా ప్రకృతి సౌందర్యాన్ని ఇష్టపడే వారైతే, కేరళను చూడటానికి ప్లాన్ చేస్తుంటే.. కనక సమ్మర్ హాలీడేస్‌లో ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కూడా ఇక్కడికి ట్రిప్ వెళ్లొచ్చు.
మున్నార్:
ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటి. ఈ ప్రదేశం యొక్క అందం మాటలతో వర్ణించలేనిది. ఇక్కడ దాదాపు 80,000 మైళ్ల దూరం వరకు కొండలను కప్పి ఉంచే కాఫీ తోటలు ఉంటాయి. మున్నార్ సాధారణంగా చల్లగా ఉంటుంది. ఇది మీకు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. మున్నార్ సమీపంలోని అనేక ప్రాంతాల్లో నేచురల్ కాఫీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు.
తేక్కడి:
ఈ ప్రదేశం వన్యప్రాణులు పెరియార్ ఏనుగులు, పులులు , గౌర్ వంటి వివిధ జాతుల జంతువులు, పక్షుల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. దీంతో పాటు.. ఈ ప్రదేశం యొక్క సహజ సౌందర్యం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. కేరళలోని అత్యుత్తమ వన్యప్రాణులను చూడటానికి.. తేక్కడి సరస్సులో పడవ ప్రయాణం చేయడం తప్పనిసరి. మీరు మరింత సాహసోపేతమైన టూర్ చేయాలనుకుంటే.. మీరు తేక్కడి నుండి గవి మీదుగా మోజియార్‌కు వెళ్ళవచ్చు.
కొచ్చి:
ఇది మధ్య కేరళలో ఉంది. కొచ్చి నుండి కేరళలోని ఇతర ప్రదేశాలకు చేరుకోవడం సులభం అవుతుంది. కేరళ పర్యటనకు ఇది ఒక ప్రారంభ స్థానం లాంటిది. దీని కారణంగా కొచ్చి కూడా ప్రజలకు ఆకర్షణీయ ప్రదేశంగా మారింది.
ఎర్నాకులం:
ఇది కేరళలోని ఆధునిక నగరాల్లో ఒకటి. ఎర్నాకులంలో మీరు బ్రిటిష్, పోర్చుగీస్, డచ్ సంస్కృతిని చూడొచ్చు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ సహజ నౌకాశ్రయాలలో ఒకటి. దీనిని ‘అరేబియా సముద్ర రాణి’ అని పిలుస్తారు.
వర్కాల బీచ్:
కేరళలోని అత్యుత్తమ బీచ్‌లలో వర్కాల ఒకటి. వర్కాల తిరువనంతపురం నుండి 51 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యం, ఎత్తైన రాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. బీచ్‌లో సన్ బాత్, బోటింగ్, సర్ఫింగ్ , నేచురల్ థెరపీ వంటి అనేక సాహసోపేత కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి.
కోవలం:
ఈ ప్రదేశం కోవలం బీచ్, లైట్ హౌస్ బీచ్ , హవా బీచ్ లకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సూర్య స్నానం, ఈత కొట్టడం, క్రూజింగ్, కేరళలోని ప్రసిద్ధ ఆయుర్వేద బాడీ మసాజ్‌లను ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ సూర్యాస్తమయం చూడటానికి ప్రజలు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు.
కుమరకోమ్:
కుమరకోమ్ కేరళలోని ఒక చిన్న మరియు అందమైన పట్టణం. గతంలో ఈ ప్రదేశం రబ్బరు తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ ప్రదేశం పక్షుల అభయారణ్యంగా అభివృద్ధి చెందింది. పక్షి పరిశోధకులకు కూడా కుమారకోమ్ అనువైన ప్రదేశం.
వయనాడ్:
కేరళలోని పన్నెండు జిల్లాలలో వయనాడ్ ఒకటి. ఇది కన్నూర్ , కోజికోడ్ జిల్లాల మధ్య ఉంటుంది.
దీని భౌగోళిక స్థానం కారణంగా ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కూడా. పశ్చిమ కనుమలలోని పచ్చని పర్వతాల మధ్య ఉన్న వయనాడ్ సహజ సౌందర్యం ఇప్పటికీ దాని సహజ రూపంలో ఉంది.
Also Read: వారణాసి టూర్.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలు !
వాగమోన్:
ఇడుక్కి-కొట్టాయం సరిహద్దులో ఉన్న వాగమోన్, కేరళలోని ఒక కొండ ప్రాంతం. పచ్చిక బయళ్ళు, తోటలు, డేల్స్, టీ తోటలు , లోయలకు ప్రసిద్ధి చెందిన వాగమోన్ ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడి కొండలు గొలుసు మాదిరిగా ఉంటాయి. ఇవి చాలా ప్రత్యేకమైనవి.
కోజికోడ్:
గతంలో కాలికట్ అని పిలువబడే కోజికోడ్ చారిత్రక, సాంస్కృతిక , విద్యాపరమైన ఔన్నత్యానికి ప్రసిద్ధి చెందింది. తూర్పు కేరళ ,ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మధ్య కాలికట్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. వాస్కోడిగామా మొదట సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడానికి వస్తువులను వెతుకుతూ కాలికట్‌కు వచ్చాడని చెబుతారు.నేటికీ ఇది కేరళలోని అతి ముఖ్యమైన వ్యాపార నగరాల్లో ఒకటి.