Srinidhi Shetty: ప్రముఖ కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో కేజీఎఫ్ 1 , కేజీఎఫ్ 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్. కన్నడ హీరో యష్ (Yash ) ఇందులో హీరోగా నటించారు. ఇకపోతే భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలై.. అటు చిత్ర బృందానికే కాదు ఇటు శ్రీనిధి శెట్టికి కూడా మంచి ఇమేజ్ అందించింది. ఇకపోతే ఇప్పుడు ఈమె నాని (Nani ), శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబినేషన్లో ‘హిట్ యూనివర్స్’ లో భాగంగా వస్తున్న ‘హిట్ 3 : ది థర్డ్ కేస్’ లో అవకాశాన్ని దక్కించుకుంది. ఇకపోతే ఇదే సినిమాతో ఈమె తెలుగులో పరిచయం కాబోతోంది. మే ఒకటవ తేదీన థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
హింస నన్ను ఇంతగా ఇష్టపడుతుందని అనుకోలేదు..
ఇక అందులో భాగంగానే పలు విషయాలను పంచుకుంది. తెలుగులో మీకు ఇది మొదటి సినిమా కదా.. దీనికి ‘ఏ’ సర్టిఫికెట్ రావడం మీకు ఎలా అనిపించింది అని విలేఖరి ప్రశ్నించగా.. దానికి శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ..” నేను కథ విన్నప్పుడే చాలా హింసతో నిండి ఉన్న యాక్షన్ చిత్రం అని అనిపించింది. నిజానికి ఈ కథకు అంత యాక్షన్ అవసరం ఉంది. ఈ జానర్ కూడా అలాంటిది కాబట్టే దీనికి ఏ సర్టిఫికెట్ వస్తుందని నాకు అప్పుడే అర్థమైంది. దీని గురించి నానితో నేను సరదాగా కూడా డిస్కస్ చేశాను. మీరు మీ సినిమాతో ఏ సర్టిఫికెట్ అందుకోవడానికి పదహారేళ్లు పట్టింది. కానీ నేను నాలుగో చిత్రానికే ఏ సర్టిఫికెట్ అందుకున్నాను అంటూ సరదాగా ఆటపట్టించేదాన్ని. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. మా సినిమాను 18 ఏళ్లలోపు పిల్లలు చూసే అవకాశం లేకుండా పోయింది. కానీ మిగతా ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను” అంటూ తెలిపింది శ్రీనిధి శెట్టి.
హింసే నన్ను ఇష్టపడుతోంది..
ఇకపోతే శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ..” నా నాల్గవ చిత్రానికే ఏ సర్టిఫికెట్ రావడం నాకు కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే నేను హింసను ఇష్టపడడం లేదు.. కానీ అదే నన్ను ఇష్టపడుతోంది. కే జి ఎఫ్ లో యష్ చెప్పినట్టుగా..వైలెన్స్ ఐ డోంట్ లైక్ ఇట్.. ఐ అవాయిడ్.. బట్ వైలెన్స్ లైక్స్ మీ .. డోంట్ అవాయిడ్” అంటూ సరదాగా నవ్వుతూ తెలిపింది. ఇక హింసే నన్ను ఇష్టపడుతుంది కాబట్టి నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. హిట్ 3 తొలి నుంచే హింసాత్మక చిత్రమేమి కాదు.. ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే యాక్షన్ కనిపిస్తుంది .కేజిఎఫ్ చిత్రానికి , ఈ హిట్ 3 చిత్రానికి పూర్తి వ్యతిరేకత ఉంటుంది.”. అంటూ తెలిపారు శ్రీనిధి శెట్టి ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Ramcharan Statue: చరణ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. అక్కడే విగ్రహ ఆవిష్కరణ..!