Srinidhi Shetty: కొందరు హీరోయిన్లకు ఒకే సినిమాతో లక్ బాగా కలిసొచ్చేస్తుంది. కానీ మొదటి సినిమానే పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అయిన హీరోయిన్స్ చాలా తక్కువమందే ఉన్నారు. అలాంటి వారిలో శ్రీనిధి శెట్టి ఒకరు. శ్రీనిధి శెట్టి పేరు చెప్తే ప్రేక్షకులు గుర్తుపడతారో లేదో తెలియదు కానీ ‘కేజీఎఫ్’ బ్యూటీ అంటే మాత్రం కచ్చితంగా అందరూ గుర్తుపడతారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అప్పటివరకు తెలుగు, తమిళం నుండి పాన్ ఇండియా సినిమాలు వచ్చినా.. కన్నడ నుండి వచ్చి మొదటి పాన్ ఇండియా సినిమాగా హిట్ కొట్టింది ‘కేజీఎఫ్’. అందులో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టి ఇప్పుడు తన తెలుగు డెబ్యూకు సిద్ధమయ్యింది.
తెలుగులో డెబ్యూ
ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘కేజీఎఫ్’. అప్పటివరకు హీరోయిన్‌గా అసలు అనుభవమే లేని శ్రీనిధి శెట్టిని ఇందులో యశ్‌కు జోడీగా నటించడానికి ఎంపిక చేశాడు ప్రశాంత్ నీల్. చాలావరకు ఈ సినిమా అంతా యశ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అయినా కూడా శ్రీనిధి తన క్యూట్ యాక్టింగ్‌తో గుర్తింపు సాధించింది. మొదటి చాప్టర్‌లో రిచ్ కిడ్ పాత్రలో కనిపించి మెప్పించగా.. సెకండ్ చాప్టర్‌లో తన ఎమోషనల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అలా తనకు ఇతర భాషల్లో కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది. తెలుగులో తనకు డెబ్యూను అందించే బాధ్యత నేచురల్ స్టార్ నాని తీసుకున్నాడు.
అదే కారణం
శైలేష్ కొలను, నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమానే ‘హిట్ 3’. ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) మొదటిసారి తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుండి శ్రీనిధి క్యారెక్టర్‌కు సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ ఏం విడుదల కాలేదు. కానీ నాని, శ్రీనిధి శెట్టి మధ్య లవ్ సాంగ్ ‘ప్రేమ వెల్లువ’ మాత్రం బయటికొచ్చి మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అలా శ్రీనిధి శెట్టిపై కూడా ఫోకస్ పెరిగింది. త్వరలోనే మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా అసలు తన తెలుగు డెబ్యూ కోసం ‘హిట్ 3’ లాంటి ఒక థ్రిల్లర్‌ను ఎంచుకోవడానికి కారణమేంటి అని తనకు శ్రీనిధికి ప్రశ్న ఎదురయ్యింది.
Also Read: చిన్నారిని కాపాడిన దిశా పటానీ సోదరి.. ఇంతకీ ఏం జరిగిందంటే.?
కీలకమైన పాత్ర
‘‘హిట్ 3 (Hit 3) సినిమా అవకాశం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎక్కువగా ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేశాను. నాని (Nani) అంటే ఒక బ్రాండ్. ఒకసారి తను మనకు ఒక సినిమా ఆఫర్ చేస్తే ఎక్కువగా ప్రశ్నలు అడగకుండా యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను ఎక్కువగా సినిమా ప్రోమోస్‌లో కనిపించలేదు కానీ నా పాత్ర సినిమాలో చాలా కీలకం’’ అని చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి. అయితే ఇది ఒక థ్రిల్లర్ సినిమా కాబట్టి, అందులోనూ నాని పోలిస్ పాత్రలో కనిపించనున్నాడు కాబట్టి శ్రీనిధి పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండకపోవచ్చని కూడా ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ‘హిట్ 3’ మే 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.