Telangana Weather Update: తెలంగాణలో సూర్యుడు భగభగ మండుతున్నాడు. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ చివరి వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ప్రభావాన్ని చూపించడంతో జనం భయంతో వణికిపోతున్నారు. గత మూడు రోజులుగా తెలంగాణలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. రేపు (శనివారం) ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఏకంగా 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ ఇష్యూ చేసింది. అటు పలు జిల్లాలో ఈదురు గాలులలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే?
గత రెండు రోజుల మాదిరిగానే ఈ రోజు కూడా ఎండలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భానుడు నిప్పులు కురిపించాడు. ఎండలకు తోడు ఉక్కపోత తోడు కావడంతో ప్రజలు ఉక్కరిబిక్కిరి అయ్యారు. వడగాలులు తీవ్రంగా వీస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ కీలక సూచనలు చేసింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని తెలిపింది. సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వర్షాలు కురిసే జిల్లాలు!
ఇక పగటి పూట ఎండలు మండినా, పలు జిల్లాల్లో సాయంత్రానికి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఓ నాలుగు, ఐదు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్, రామగుండం, జగిత్యాల, జమ్మికుంట, వరంగల్ లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని వెల్లడించింది.
Read Also: విమానం దిగితే రూ. 2.5 లక్షలు ఇస్తాం, ఎయిర్ లైన్స్ ఆఫర్ కు ప్రయాణీకుడు ఏం చేశాడంటే?
ఏపీలోనూ మండుతున్న ఎండలు
అటు ఆంధ్రాలోనూ ఎండలు మండుతున్నాయి. రాయలసీమలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. నంద్యాల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరులో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదలయ్యాయి. ఏపీలోని మిగతా జిల్లాలోలనూ ఎండలు తీవ్రంగానే ఉంటాయని వెల్లడించింది వాతావరణ కేంద్రం. ఇక ఉత్తరాంధ్రలో ఎండలతో పాటు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాల సమయంలో ఉరుములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవసాయ పనులలో ఉండే వాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వీలైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటకు రాకూడదన్నారు. ఉదయం, లేదంటే సాయంత్రం బయటి పనులు చూసుకోవాలన్నారు.
Read Also: సమ్మర్ రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం, అందుబాటులోకి మరిన్ని ప్రత్యేక రైళ్లు!