BigTV English

Revanth reddy: ఇందిరను ఆదర్శంగా తీసుకోవాలి.. ఉగ్రమూకలకు గట్టి జవాబివ్వాలి

Revanth reddy: ఇందిరను ఆదర్శంగా తీసుకోవాలి.. ఉగ్రమూకలకు గట్టి జవాబివ్వాలి

ఉగ్రవాద దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో వారికి గట్టి జవాబిచ్చేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 1967, 1971 లో జరిగిన సంఘటనలను ఆయన గుర్తు చేశారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉగ్రమూకలకు ధీటైన జవాబివ్వాలని ఆయన కేంద్రానికి పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని వివరించారు.


దుర్గామాత ఇందిర..
“1967, 1971లో కూడా పాకిస్తాన్ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వారిగి గట్టి జవాబిచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే రెండు ముక్కలు చేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని ప్రతిపక్ష నేత వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారు.” అని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ దుర్గామాత భక్తులుఅని, ఆయన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఇందిర లాగా ఉగ్రవాదులకు గట్టి జవాబివ్వాలన్నారు. ఈ పోరాటంలో కోట్లాది భారతీయులంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారని, ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేయాలని కోరారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపాలన్నారు.

పహల్గాం ఉగ్రదాడుల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. హైదరాబాద్ లో పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సీఎం రేవంత్ వెంట నడిచారు. ఈ ర్యాలీకి ఎంఐఎం నేతలు, సామాన్యులు కూడా తరలి వచ్చారు. కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ చేపట్టారు. పహల్గాం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహం ముందు కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. సెల్ ఫోన్ లైట్లు వెలిగించి పాకిస్తాన్ కుట్రలను తిప్పికొడతామని నినాదాలు చేశారు.

దేశం ప్రశాంతంగా ఉన్న వేళ.. ఉగ్రవాదుల దాడి అందర్నీ కలచి వేసిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పహల్గాంలో భారత పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అందరూ ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోడానికి అందరం కృషి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్లిష్ట సమయాల్లో దేశ పౌరులంతా ఒకే తాటిపైకి రావాలని దేశం కోసం అందరం కలసి కట్టుగా పోరాడాలన్నారు.

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×