BigTV English

Rajamouli Controversy : శ్రీనివాస రావు మిస్సింగ్… రాజమౌళి వివాదంలో అసలేం జరుగుతోంది ?

Rajamouli Controversy : శ్రీనివాస రావు మిస్సింగ్… రాజమౌళి వివాదంలో అసలేం జరుగుతోంది ?

Rajamouli Controversy : ‘బాహుబలి’ (Baahubali) మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న జక్కన్న (SS Rajamouli), ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి డైరెక్టర్ గా గుర్తింపును దక్కించుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘ఎస్ఎస్ఎంబి 29’ (SSMB29) అనే మూవీతో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా కొత్త అడుగు వేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి స్నేహితుడు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.


శ్రీనివాస రావు అనే వ్యక్తి రాజమౌళి తనను టార్చర్ చేస్తున్నాడనీ, ఆత్మహత్య చేసుకుంటానని ఓ సూసైడ్ లెటర్ రాసి, సెల్ఫీ వీడియోలు సైతం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా శ్రీనివాసరావు ట్రయాంగిల్ లవ్ స్టోరీతో రాజమౌళిపై షాకింగ్ ఆరోపణలు చేయడం సంచలనానికి దారి తీసింది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఇటు శ్రీనివాసరావు కనిపించకుండా పోయాడు. మరోవైపు రాజమౌళి ఈ వివాదంపై పెదవి విప్పలేదు. అసలు రాజమౌళి వివాదంలో ఏం జరుగుతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.

శ్రీనివాసరావు మిస్సింగ్…


రాజమౌళి స్నేహితుడిని అని చెప్పుకున్న శ్రీనివాసరావు… తమ ఇద్దరి మధ్య  34 ఏళ్ల స్నేహం ఉందని, యంగ్ ఏజ్ లో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. “మాది ఆర్య 2 వంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అయితే ఈ రియల్ లైఫ్ స్టోరీలో నన్ను రాజమౌళి త్యాగం చేయమన్నాడు. ‘శాంతి నివాసం’ సీరియల్ టైం కంటే ముందుగా ఈ విషయం జరిగింది. రాజమౌళి ఇప్పుడు నెంబర్ వన్ డైరెక్టర్. నా 30 ఏళ్ల జీవితాన్ని అతడి కోసం త్యాగం చేశాను. ఓసారి మా ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు మన స్టోరీని సినిమా తీస్తానని చెప్పడంతో టార్చర్ మొదలైంది. నాకు 55 ఏళ్లు వచ్చాయి. రాజమౌళి వల్ల పెళ్లి కాలేదు. ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయింది. నా మరణ వాంగ్మూలం కింద సుమోటోగా ఈ కేసును పోలీసులు తీసుకోవాలని కోరుతున్నాను” అంటూ శ్రీనివాసరావు రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది.

అయితే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు శ్రీనివాసరావుపై విరుచుకుపడ్డారు. అతనికి పిచ్చి పట్టిందనీ, రాజమౌళి ఇప్పుడు పెద్ద డైరెక్టర్ కాబట్టి సెటిల్మెంట్ కోసం ఇలా చేస్తున్నాడని విమర్శించారు. లేదంటే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రతిష్టను దిగజార్చడానికి ఎవరి ప్రోద్బలంతోనో అతను ఇలా చేశాడని మండిపడ్డారు. అయితే ఆశ్చర్యకరంగా శ్రీనివాసరావు ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత మళ్లీ బయట ఎక్కడా కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేయలేదు. దీంతో శ్రీనివాసరావు మిస్సింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి సైలెన్స్ కు అర్థం ఏంటి ?

మరోవైపు రాజమౌళి ఈ వివాదంపై ఇప్పటిదాకా స్పందించలేదు. నిన్న కీరవాణి ‘నా టూర్’ కాన్సర్ట్ కు సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశాడు జక్కన్న. అందులో కూడా ఎక్కడా రాజమౌళి ఈ వివాదం గురించి మాట్లాడలేదు. దీంతో అసలు రాజమౌళి వివాదంలో ఏం జరిగింది ? శ్రీనివాసరావు ఏమయ్యాడు? రాజమౌళి ఎందుకు నోరు విప్పట్లేదు? అనే డౌట్స్ తెరపైకి వస్తున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×