Nails: మన గోళ్లను అందంగా అలంకరించుకోవడానికి చాలా శ్రద్ధ చూపుతాము. కానీ మీరు ఎప్పుడైనా ఆరోగ్యానికి సంబంధించి మీ గోళ్లపై శ్రద్ధ పెట్టారా ? అవును, గోర్లు మీ ఆరోగ్యం గురించి చాలా ముఖ్యమైన సూచనలను ఇస్తాయి. వాటి రంగు, ఆకృతి , స్థితిని బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో, శరీరంలో ఏ ఖనిజాలు లోపించి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గోళ్లు ఏ రంగులో ఉంటే అది ఏ వ్యాధిని సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1979లో జరిగిన ఒక అధ్యయనంలో వందలాది మంది గోళ్ల పెరుగుదలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. 30 సంవత్సరాల వయస్సు తర్వాత, ప్రతి సంవత్సరం వారి గోళ్లు పెరుగుదల వారంలో 0.5% తగ్గుతుందని కనుగొన్నారు. మీ గోర్లు ఇంత కంటే వేగంగా పెరుగుతున్నట్లయితే.. మీ వయస్సు సగటు కంటే నెమ్మదిగా పెరుగుతోందని అర్థం. గోళ్ల పెరుగుదల మీ కణాలు, కణజాలాల ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోళ్లు ఆరోగ్యంగా ఉంటే, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
పసుపు రంగులోకి మారిన గోర్లు:
మీ గోళ్ల రంగు పసుపు రంగులోకి మారితే, అది కాలేయం లేదా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చు ముఖ్యంగా పసుపు రంగు గోర్లు కాలేయం లేదా కామెర్లును సూచిస్తాయి. మీరు సిగరెట్ తాగితే అది మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే, డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం.
గోర్లు సాధారణం కంటే తెల్లగా ఉంటే:
గోర్లు సాధారణం కంటే తెల్లగా ఉండటం మూత్రపిండాల సమస్యలకు సంకేతం కావచ్చు. గోర్లు తెల్లగా, నిస్తేజంగా కనిపిస్తే, అది మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేదని సూచిస్తుంది. అంతే కాకుండా గుండె, కాలేయం లేదా మధుమేహం వంటి సమస్యలకు ఇది ఒక హెచ్చరికగా కూడా.
గోళ్ళపై గీతలు లేదా గాట్లు:
గోళ్ళపై ఎరుపు, తెలుపు లేదా నలుపు గీతలు కనిపిస్తే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదని అర్థం. ముఖ్యంగా, గోళ్లపై తెల్లటి మచ్చలు లేదా చారలు కనిపిస్తే, అది జింక్, కాల్షియం లేదా ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. సరైన ఆహారం, సప్లిమెంట్లతో ఈ సమస్యను నయం చేయవచ్చు.
మృదువైన గోర్లు:
మీ గోర్లు చాలా మృదువుగా, జిగటగా లేదా తేమగా మారితే, అది థైరాయిడ్ లోపం (హైపోథైరాయిడిజం) సంకేతం కావచ్చు. థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం కూడా గోళ్ల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
గోర్లు పగుళ్లు లేదా విరిగిపోవడం:
గోళ్ళలో పగుళ్లు లేదా విరిగిపోవడం మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా విటమిన్ బి లోపానికి సంకేతం కావచ్చు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి, సమతుల్య ఆహారం, తగినంత విశ్రాంతి, ఒత్తిడి లేని జీవనశైలిని అలవాటు చేసుకోవాలి.
Also Read: ఈ ఆయిల్స్ వాడితే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా !
పొడవాటి గోళ్లు:
మీ గోర్లు సాధారణంగానే అకస్మాత్తుగా ఎక్కువగా పెరగడం లేదా సన్నబడటం వంటివి జరిగితే.. అది హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా మహిళలు గర్భధారణ సమయంలో లేదా రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పులను ఎదుర్కొంటారు. ఇది గోళ్ల రూపాన్ని ప్రభావితం చేస్తుంది.
గోళ్ల సాధారణ రంగు, ఆకృతి:
మీ గోర్లు ఆరోగ్యంగా, మెరుస్తూ, పరిపూర్ణ ఆకృతిలో ఉంటే.. అది మీ శరీరం ఆరోగ్యంగా ఉందనడానికి సంకేతం. మంచి పోషకాహారం, సరైన జీవనశైలి ద్వారా గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.