Coriander: కొత్తిమీరను వివిధ రకాల కూరల్లో వినియోగిస్తారు. ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తరచుగా తీసుకునే ఆహారంలో దీన్ని చేర్చుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది దీన్ని తినడానికి పెద్దగా ఇష్టపడరు. గుండె జబ్బులు రాకుండా చేయడంలో కూడా కొత్తిమీర సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండెను కొత్తిమీర ఎలా రక్షిస్తుందో, దీని వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
జీర్ణక్రియ
జీర్ణక్రియ సక్రమంగా ఉండే చూపుకోవడానికి కొత్తిమీర సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ కడుపు సమస్యలను తగ్గిస్తుందట. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేయడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర ఆకులను సలాడ్‌లో లేదా జ్యూస్‌లో కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని అంటున్నారు.
ఇమ్యూన్ పవర్
కొత్తిమీరలో విటమిన్-సి, విటమిన్-ఎ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయట. అంతేకాకుండా రోగాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయయని అంటున్నారు. కొత్తిమీరను రోజూ తీసుకోవడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందవచ్చట.
చర్మ సంరక్షణ
కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయట. అంతేకాకుండా చర్మంపై మచ్చలను నివారిస్తాయని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. కొత్తిమీర ఆకులను పేస్ట్‌లా చేసి ముఖానికి రాస్తే చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుందట.
షుగర్ నుంచి రక్షణ
డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కొత్తిమీర దివౌషధంలా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయట. ఇప్పటికే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొత్తిమీర ఆకులను సూప్‌లో లేదా టీలా తాగితే మధుమేహ నియంత్రణలో ఉంటుందట.
గుండెకు వెరీ గుడ్
కొత్తిమీరలో పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతాయట. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయపడతాయని అంటున్నారు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి తోడ్పడతాయట.
నేచురల్ డిటాక్సిఫికేషన్
శరీరాన్ని నేచురల్‌గా డిటాక్సిఫై చేయడంలో కూడా కొత్తిమీర సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కిడ్నీలను శుభ్రం చేస్తుందట. అంతేకాకుండా శరీరంలోని హానికరమైన పదార్థాలను బయటకు పంపేందుకు కొత్తిమీర సహాయపడుతుందట. అందుకే ప్రతి రోజూ పరగడుపున కొత్తిమీర జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి
కొత్తిమీరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుందట. దీనిని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొత్తిమీరను సలాడ్‌లో లేదా గ్రీన్ స్మూతీలలో చేర్చుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.