Thalapathi Vijay: శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు తలపతి విజయ్. అయితే అంతకుముందు విజయ్ చాలా సినిమాలు చేసినా కూడా తెలుగు వాళ్లకి పెద్దగా పరిచయం లేదు. విక్రమ్, విశాల్, సూర్య వంటి తమిళ్ నటులు మాత్రమే తెలుగు ప్రేక్షకులకు అప్పట్లో బాగా పరిచయం. ఇక రజనీకాంత్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్లు పరభాష నటులని ఏ రోజు అనిపించలేదు.
స్నేహితుడు సినిమా తర్వాత విజయ్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చాయి. ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకి ప్రమోషన్ కి కూడా హైదరాబాద్ కు వచ్చాడు విజయ్. ఇక ప్రస్తుతం తెలుగులో విజయ్ కి కూడా మంచి మార్కెట్ ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమాను కూడా చేశాడు విజయ్. అయితే విజయ్ తన మార్కెట్ ను తెలుగులో సరిగ్గా వాడుకోవట్లేదు అని అందరికీ తెలిసిందే. విజయ్ నటించిన ఏ సినిమా తెలుగులో రిలీజ్ అవుతున్న కూడా తెలుగు ప్రమోషన్స్ కి హాజరు కాడు విజయ్.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌ను కాపీ కొట్టిన కోలీవుడ్ స్టార్… రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయాడుగా…
పొలిటికల్ ఎంట్రీ
ఇక రీసెంట్ గా తలపతి విజయ్ ఒక రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ పేరు తమిళ వెట్రి కళగం. ఈ పార్టీకి సంబంధించిన జెండాను కూడా కొద్దిరోజుల క్రితం ఆవిష్కరించాడు విజయ్. అయితే దీనిలో విజయ్ (Vijay) మాట్లాడుతూ గెలిచినా ఓడిన ఒంటరిగానే ప్రయాణిస్తాను. నా ఫ్యాన్స్ తో ఇంకో పార్టీ జెండాను మోయనవ్వను అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ కామెంట్స్ విజయ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేశాడా అంటూ కొంతమంది సందేహం వ్యక్తం వ్యక్తం చేశారు అప్పట్లో కొంతమంది. విజయ్ ని ప్రేమించే వాళ్ళతో పాటు ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
నేడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా తమిళ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్ చెన్నై పాలవాక్కంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చిన్న కారులో వచ్చి, పూలమాల సమర్పించారు. విజయ్ కారులో నుంచి దిగడం, చెప్పులు విడవడం ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి దండ వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని చూసిన కొందరు విజయ్ సింప్లిసిటీ అని కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం పాలిటిక్స్ లోకి దిగాడు కదా బాగానే యాక్టింగ్ చేస్తున్నాడు అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు.
Also Read : Hit 3 Trailer Lunch Event : 15 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని కలవడానికి వైజాగ్ వచ్చేవాడిని