Thaman : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు తమన్. కిక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంటర్ అయిన్ తమన్ వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్లారు. ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ చేరుకున్నారు. తన కెరీర్ లో 100 సినిమాలకు పైగా పూర్తి చేసుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా తమన్ కెరియర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తమన్ కెరియర్ లో వచ్చిన 100వ సినిమా అది. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మంచి అనుబంధం తమన్ కు ఏర్పడింది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అన్ని సినిమాలకు దాదాపు తమనే సంగీతం అందించాడు.
చాలామంది ట్విట్టర్ లో తమన్ ను నందమూరి తమన్ అని పిలుస్తూ ఉంటారు. దీనికి కారణం బాలకృష్ణ సినిమాలకు తమన్ ఇచ్చే మ్యూజిక్ అని చెప్పాలి. బాలకృష్ణ సినిమాకు మ్యూజిక్ చేయాలి అంటేనే తమన్ కి పూనకం వస్తుంది. అందరి హీరోల కంటే కూడా ఎక్కువ డ్యూటీ బాలకృష్ణ సినిమాలకు చేస్తూ ఉంటాడు. అది సినిమాల పరంగానే కాకుండా ఇప్పుడు ఆఫ్లైన్ లో కూడా బాలయ్య మీద తన ప్రేమను తెలుపుకున్నాడు తమన్. తలసేమియా వ్యాధి బాధితుల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ మ్యూజికల్ నైట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే దీనికి తమన్ ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా అతిథిగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఇదే ఈవెంట్లో తన వంతు సహాయంగా 50 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.
తమన్ మ్యూజిక్ మ్యూజికల్ నైట్ ఈవెంట్ ను చాలామంది ప్రశంసించారు. నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ మ్యూజికల్ నైట్ ఈవెంట్ విజయవంతం కావటానికి కృషి చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అతి పెద్ద కళాకారుల బృందంతో ఈ కార్యక్రమం సారధ్య బాధ్యతలు స్వీకరించిన సినీ సంగీత దర్శకులు తమన్ గారు మ్యూజికల్ నైట్‌ను సూపర్ హిట్ చేశారు. ‘యుఫోరియా’ కాన్సెర్ట్ కోసం సేవా భావంతో పని చేసిన తమన్ గారు, వ్యాఖ్యాత సుమ గారు, కళాకారులు అందరికీ కృతజ్ఞతలు.
Also Read : SKN Controversy : తెలుగు అమ్మాయిల మీద బ్యాన్…. మిడిల్ ఫింగర్ అంటూ ఎస్కేఎన్ పరువు తీసేసిన హీరోయిన్
ఇక తాజాగా తమన్ ట్విట్టర్ వేదికగా ఈ ఈవెంట్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. ‘‘ఈ ఈవెంట్‌ను జీవితాంతం మర్చిపోలేను. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన నారా భువనేశ్వరి మేడమ్‌కు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణల ఎదుట పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అని పోస్ట్ పెట్టారు. పోస్ట్ చేసిన వీడియోలో చాలామంది తమన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
An Event To Cherish For this Lifetime ❤️🫶
Thanks to Mam @ManagingTrustee gaaruIt was So Delightful To Perform before 🥁🥁🥁
@ncbn gaaru @naralokesh brother @PawanKalyan gaaru #NandamuriBalakrishna Gaaru 💥⭐️🔥🦁
Thanks every one for making Our #NTRTrust Event
A… pic.twitter.com/Swiv2kPfgZ— thaman S (@MusicThaman) February 17, 2025