Leg Swelling: శరీరంలో వాపు అనేది సాధారణ సమస్య అని చెప్పవచ్చు. ఇది అనేక కారణాల వల్ల వస్తుంది. ముఖ్యంగా చెడు ఆహారపు అలవాట్లు, అధికంగా ఉప్పు తీసుకోవడం, తక్కువ నీరు తాగడం లేదా ఏదైనా వ్యాధి కారణంగా కాళ్ల వాపు వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక వాపు కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు, అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల మనం ఈ సమస్య నుండి బయట పడవవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు:
పసుపులో ఉండే కుర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్, ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయ పడుతుంది. మీరు పసుపు నుండి మరిన్ని ప్రయోజనాలను పొందాలనుకుంటే.. దానిని నల్ల మిరియాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది దాని ప్రభావాన్ని మరింత పెంచుతుంది.
అల్లం:
అల్లం గొంతు నొప్పిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో ఉండే జింజెరాల్ అనే మూలకం కాళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని టీ, డికాషన్ లేదా ఆహారంలో కలిపి సులభంగా ఉపయోగించవచ్చు.
బెర్రీలు:
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఇతర బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో సహాయ పడతాయి. వీటిలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు గుండె, చర్మానికి కూడా మేలు చేస్తాయి.
ఆకుకూరలు:
పాలకూర, మెంతులు, బ్రోకలీ వంటి ఇతర ఆకు కూరలు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ కె , యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుతాయి.
టమాటో:
టమోటాలలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వాపును తగ్గిస్తుంది. ముఖ్యంగా వండిన టమోటాలు (టమోటా సూప్ లేదా కర్రీ వంటివి) శరీరానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి.
వెల్లుల్లి:
వెల్లుల్లి సహజ యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని పచ్చిగా తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కూరగాయలు లేదా పప్పుధాన్యాలలో చేర్చడం ద్వారా ఈజీగా తినవచ్చు.
Also Read: పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినాలా ? వద్దా ?
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో ఉండే కాటెచిన్ అనే మూలకం శరీరంలోని వాపులను తగ్గించి, రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వాపు సమస్య నుండి కూడా మీరు ఈజీగా బయట పడవచ్చు.
పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.