BigTV English

CM Chandrababu: మెకానిక్‌ షెడ్‌లో సీఎం చంద్రబాబు.. అధికారుల్లో టెన్షన్ ఎందుకు?

CM Chandrababu: మెకానిక్‌ షెడ్‌లో సీఎం చంద్రబాబు.. అధికారుల్లో టెన్షన్ ఎందుకు?

CM Chandrababu: సీఎం చంద్రబాబు రూటు మార్చారా? అధికారులకు చెప్పినట్టుగా చెస్తున్నారా? 1994 సీఎంను చూస్తారని పదేపదే ఎందుకు చెబుతున్నారు? అధికారులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందా? అమరావతిలో సీఎం చంద్రబాబు ఆకస్మిక పర్యటన వెనుక ఏం జరిగింది? ఎలాంటి సంకేతాలు ఇచ్చారు? ఇదే చర్చ అప్పుడే అధికారుల్లో మొదలైపోయింది.


సీఎం చంద్రబాబు అధికారులను పదేపదే హెచ్చరిస్తున్నారు. ఆకస్మిక పర్యటనలు మొదలుపెడతానని పదే పదే చెబుతున్నారు. మళ్లీ పాత ముఖ్యమంత్రిని త్వరలో చూస్తారని సమయం, సందర్భం వచ్చినప్పుడు వివరిస్తున్నారు. అయినా కొందరు అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడంలేదు. రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో అప్పటి అధికారులకు ఈ విషయం బాగా అర్థమైంది కూడా.

సోమవారం ఉదయం అమరావతిలో సడన్‌గా పర్యటించారు సీఎం చంద్రబాబు. తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌తో కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో పొన్నెకల్లులో చిన్న షాప్ దగ్గర ఆగారు. షాప్‌లో ఉన్న మహిళతో మాట్లాడారు. ఆమె కుటుంబం, జీవనోపాధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


వారి గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి, అవసరమైన ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరకు పెన్షన్ రాలేదని చెప్పుకొచ్చారు. పర్మినెంట్‌గా షాపు పెట్టి, వారికి జీవనోపాధి కల్పించాలన్నారు.

ALSO READ: జనసేన జెండా ఎగురుతుందా? ఆపేందుకు వైసీపీ ప్రయత్నాలు

అక్కడి నుంచి కొంత ముందుకెళ్లారు సీఎం చంద్రబాబు. మోటార్ మెకానిక్ షెడ్ యువకుడి ప్రవీణ్‌తో మాట్లాడుతూ అతడి షాపుకు వెళ్లారు. కాసేపు ఆ షాపు వద్ద కూర్చున్నారు. గ్యారేజ్ చూసి షాకయ్యారు. వెంటనే కలెక్టర్‌ని పిలిచి వివరాలు తెలుసున్నారు. మంచి ప్రాంతాన్ని గుర్తించి అక్కడ షాపు పెడితే అక్కడ ఉంటావా అని అడిగారు. సరేనని మెకానిక్ చెప్పాడు.

యువకుడికి స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇప్పించి లైఫ్‌లో సెటిల్ చేసేలా చూడాలని కలెక్టర్‌ని ఆదేశించారు. ఆ తర్వాత షాపులో ఉన్న సామాన్లు గురించి అడిగి తెలుసుకున్నారు. అవి పాడైపోయానని చెప్పుకొచ్చాడు. పని చేస్తాను గానీ, అందుకు సరైన పనిముట్లు లేవని తెలిపాడు. సరే తాను అధికారులతో మాట్లాడుతాను.. ధైర్యంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లారు సీఎం చంద్రబాబు.

ఒకే రోజు రెండు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. దీంతో అధికారుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతానికి రోడ్డు పక్కనున్న షాపులను మాత్రం పరిశీలించారు. ఇంకా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లలేదు. అదే జరిగితే అధికారులకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో ఆకస్మిక పర్యటనకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. లోపాలుంటే అక్కడికి అక్కడే అధికారులను సస్పెండ్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.  ప్రస్తుతం ముఖ్యమంత్రిని గమనిస్తున్నవాళ్లు మాత్రం, పాత రోజులు వస్తున్నాయని అంటున్నారు. ఆకస్మిక పర్యటనలు చేస్తానని ఇవాళ్టి పర్యటనతో నిరూపించారని అంటున్నారు.

ALSO READ: ఏపీలో ఫుల్ డిమాండ్.. ప్రభుత్వానికి రిక్వెస్టులు , ఎందుకు?

 

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×