Shivanna: సీనియర్ హీరోలు ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఒకపక్క హీరోలుగా సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క కుర్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. అలా రెండు పడవల మీద కాళ్లు వేసి కెరీర్ ను కొనసాగిస్తున్న సీనియర్ హీరోల్లో కన్నడ సూపర్ స్టార్ శివన్న ఒకరు. ఒకప్పుడు పునీత్ రాజ్ కుమార్ తప్ప తెలుగువారికి కన్నడ హీరోలు ఎవరు పరిచయం లేదు. పునీత్ చనిపోయాకా.. ఆయన అన్న శివరాజ్ కుమార్ పై తెలుగువారిలో సింపతీ పెరిగింది. ఆ తరువాత కన్నడ హీరోలు కూడా తెలుగులో పాపులారిటీని తెచ్చుకున్నారు.
ఇక శివన్న ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క స్టార్ హీరోల సినిమాల్లో క్యామియో కానీ, కీలక పాత్ర చేయడానికి కానీ వెనకాడడం లేదు. ఇప్పటికే శివన్న చాలా సినిమాల్లో క్యామియోలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్నా RC16 లో కూడా శివన్న కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. దీంతో ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకాయి.
Sankranthiki Vasthunam: 18 ఏళ్ల తరువాత ఆ సింగర్ ను దింపుతున్న అనిల్.. ఈ జనరేషన్ ను మెప్పించగలడా.. ?
కేవలం క్యామియోలా కాకుండా ముఖ్య పాత్రలోనే శివన్న కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాతో పాటు మరో స్టార్ హీరో సినిమాలో కూడా శివన్న కీలక పాత్రలో నటిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం దళపతి69. హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివన్న కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
నేడు శివన్న పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమాలోకి సాదరంగా ఆహ్వానించారు. కన్నడ సూపర్ స్టార్ ను విజయ్ సినిమాలోకి దింపేసరికి సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. త్వరలోనే ఆయన సెట్స్ లో పాల్గొనననున్నాడు. ఇక ఈ సినిమా గురించి శివన్న కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
Coolie: కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ లోకేష్.. ?
” దళపతి69 లో నాకు ఆఫర్ రావడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ నా పాత్రను, లుక్ ను ఎలా డిజైన్ చేస్తారో తెలియదు. విజయ్ మంచి నటుడు. అతను ఇంకా సినిమాలు చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ రెండు సినిమాలతో శివన్న ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.