Harihara Veeramallu : ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏంఏం రత్నం భారీ బడ్జెట్ తో మూవీని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొన్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి సినిమా ఓటీటీ హక్కుల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
వీరమల్లు ఓటీటీ రైట్స్..
పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాలకు ఓటీటీ హక్కుల రైట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించవచ్చు. ఓటీటీ, శాటిలైట్‌తోపాటు థియేట్రికల్ బిజినెస్ వ్యవహారాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ కోసం భారీ పోటీ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు ఫ్యాన్సీ రేటును, రికార్డు మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసిందనే ఇండస్ట్రీలో టాక్.. త్వరలోనే బిజినెస్ వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.
Also Read:బాబోయ్..నిర్మాతలకు బిగ్ షాక్ ఇచ్చిన ‘ప్రేమలు’ బ్యూటీ..
వీరమల్లు స్టోరీ విషయానికొస్తే..
చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే కథతో ప్రేక్షకుల మనసు దోచుకోనే ఓ వర్గం వీరుడి కథ. యాక్షన్, ఎమోషన్స్ తో కూడిన మూవీలో హై ఓల్డేజ్ ఫైట్స్‌తో పవన్ కల్యాణ్ తన అభిమానులను ఆకట్టుకొనేందుకు సిద్దమవుతున్నారు. అగ్ని లాంటి ఆవేశం, న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో నటిస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయేలా ఈసినిమా ఉంటుంది. న్యాయం కోసం యుద్ధం చేసే ధీరుడు వీరమల్లు పాత్ర తెలుగు సినిమా పరిశ్రమలో చిరకాలం నిలిచే పాత్రగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమాలో మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో నిధి అగర్వాల్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా మొదలగు వాళ్లు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందా? మే 30 తేదీనే వస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. అయితే జూన్ 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే క్లారిటీ రానుంది.. ఈ మూవీ తర్వాత ఓజీ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు.