Jacqueline Fernandez : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)ను ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ అస్సలు వదలట్లేదు. ఏ మాత్రం సమయం సందర్భం దొరికినా, వెంటనే ఆమెకు కానుకల వర్షం కురిపిస్తూ, ప్రేమ లేఖలతో తన ప్రేమని వ్యక్తపరుస్తున్నాడు. తాజాగా జైల్లో ఉండే, క్రిస్మస్ కానుకగా ఆమెకు భారీ గిఫ్ట్ ను పంపుతున్నట్టుగా తెలిపాడు. ఈ మేరకు “మై లవ్, బేబీ గర్ల్” అంటూ ఆమెకు క్రిస్మస్ సందేశం పంపించడం వైరల్ అవుతుంది.
ఆ లేఖలో “బేబీ గర్ల్, మేరీ క్రిస్మస్.. మై లవ్ ఇది మనకెంతో ఇష్టమైన పండుగ. కానీ మనమిద్దరం కలిసి దీన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. ఏదేమైనా మనిద్దరి మనసులు బాగా దగ్గరయ్యాయి. నీ చేతులు పట్టుకొని నీ కళ్ళలోకి చూస్తూ క్రిస్మస్ విష్ చేయాలని ఉంది. అయితే దూరంగా ఉన్నప్పటికీ, నేను నీ శాంటా క్లాజ్ ను కాకుండా ఆపడం ఎవరి తరం కాదు. ఈ ఏడాది నీకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అయితే వైన్ బాటిల్ గిఫ్ట్ గా ఇవ్వట్లేదు, నువ్వు ఎప్పుడూ కలలుకనే కంట్రీ ఆఫ్ లవ్ పారిస్ లోని ఒక వైన్ యార్డ్ ను కానుకగా ఇస్తున్నాను. అదే తోటలో నీ చెయ్యి పట్టుకుని సంతోషంగా నడవాలని కోరుకుంటున్నా. నేను పిచ్చోన్ని అని ఈ ప్రపంచం భావించవచ్చు. నిజంగానే నీ ప్రేమలో పడి నేను పిచ్చోన్ని అయ్యాను. నేను రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చెయ్. ఆ తర్వాత మన జంటను ఈ ప్రపంచమే చూస్తుంది” అంటూ రొమాంటిక్ లవ్ లెటర్ ని రాశాడు జాక్వెలిన్ కోసం.
అయితే అతను జాక్వెలిన్ (Jacqueline Fernandez) కోసం ఇలాంటి ప్రేమ లేఖలు రాయడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా ఇలాంటి లేఖలెన్నో పంపి, ఆమెకు గిఫ్టులు ఇస్తున్నట్టుగా వెల్లడించాడు. అయితే అతను ఇదంతా జైలు నుంచే చేస్తుండడం గమనార్హం. సుఖేష్ ప్రస్తుతం ఢిల్లీలోని జైల్లో ఉన్నాడు.
2020 జూన్ నుంచి మే 2021 వరకు మొబైల్ ఫోన్లు, ఇతర టెక్నాలజీని ఉపయోగిస్తూ, ర్యాన్‌బ్యాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అధితి సింగ్‌కు కాల్స్ చేసేవాడు. లా సెక్రటరీ అనూప్ కుమార్ గా తనని తాను పరిచయం చేసుకొని, ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి 200 కోట్లకు పైగా వసూలు చేసి పోలీసుల చేతికి చిక్కాడు. అనుమానం వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే అతను జాక్వెలిన్ (Jacqueline Fernandez)తో అతను క్లోజ్ గా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే విచారణలో సుఖేష్ జాక్వెలిన్ తన ప్రియురాలని చెప్పి షాక్ ఇచ్చాడు. కానీ ఆమె మాత్రం అతను తన జీవితంతో ఆడుకొని, కెరీర్ ని నాశనం చేశాడంటూ ఏకంగా కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చింది. హోం శాఖలో ఓ ముఖ్య అధికారి అని తనతో సుఖేష్ పరిచయం చేసుకున్నాడని చెప్పింది. దీంతో 200 కోట్ల భారీ కుంభకోణంలో జాక్వెలిన్ నిందితురాలు కాదు బాధితురాలు అని తేల్చారు పోలీసులు. ఇక అప్పటి నుంచి నడుస్తోంది జైలు నుంచి సుఖేష్ ప్రేమాయణం.