School Holidays: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త. పరీక్షలు చివరి దశకు చేరడంతో, సెలవులు రాబోతున్నాయి. ఈ ఏడాది కూడా సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోనూ ఏప్రిల్ 24 ఈ విద్యా సంవత్సరంలో లాస్ట్ వర్కింగ్ డే. ఆ తర్వాత మూడు రోజులకు (ఏప్రిల్ 27న) రిజల్ట్స్ వెల్లడించనున్నారు. ఆ తర్వాత హాలీడేస్ అనౌన్స్ చేయనున్నారు.
తెలంగాణ, ఏపీలో సెలవులు ఎప్పటి నుంచి అంటే?
సమ్మర్ హాలీడేస్ కు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో సెలవులు ఎక్కువగానే రాబోతున్నాయి. ఏప్రిల్ 27 నుంచి స్కూల్స్ క్లోజ్ కానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు ఉంటాయి. జూన్ 12 తిరిగి విద్యా సంసవత్సరం ప్రారంభం కానుంది. ఇక ఏపీలోనూ స్కూల్స్ కు ఏప్రిల్ 27 నుంచి సెలవులు ప్రకటించారు. తెలంగాణలో మాదిరిగానే జూన్ 11 వరకు సెలవులు కొనసాగుతాయి. తిరిగి జూన్ 12న స్కూల్స్ ఓపెన్ అవుతాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు అధికారికంగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఎండలను బట్టి సెలవులకు సంబంధించిన తేదీలను మార్చే అవకాశం ఉంది.
ఇంటర్ విద్యార్థులకు సెలవుల తగ్గింపు
ఇక ఏపీలో ఇంటర్మీడియట్ కు సెలవుల విషయంలో కీలక మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్రా సర్కారు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అకడమిక్ క్యాలెండర్ కూడా రెడీ చేసినట్లు సమాచారం. ప్రతి ఏటా జూన్ 1 నుంచి ఇంటర్మీడియట్ అకడమిక్ ఇయర్ మొదలయ్యేది. ఈసారి నెల ముందుగానే విద్యా సంవత్సరం మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7 నుంచి ఆడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి క్లాసులను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సెలవులు ప్రకటించనున్నారు. మే చివరి వరకు హాలీడేస్ కొనసాగనున్నాయి. జూన్ 2 నుంచి తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. మొత్తం 235 రోజులు క్లాసులు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులు కాకుండా మొత్తం 79 సెలవులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇంటర్మీడియట్ అకడమిక్ ఇయర్ గురించి ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Read Also: కార్లలో ఇక ‘నో ఏసీ’.. క్యాబ్ డ్రైవర్ల షాకింగ్ డెసిషన్ ఎందుకు?
వేసవి సెలవులలో టూర్లు ప్లాన్ చేస్తున్న పేరెంట్స్
ఇక వేసవి సెలవులు ఇచ్చేందుకు ఉయభ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు టూర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు కాస్త రిలాక్స్ అయ్యేలా సమ్మర్ వెకేషన్స్ ను తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మరికొంత మంది పిల్లలు అమ్మమ్మ, నాన్నవాళ్ల ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
Read Also: ఫారిన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇక హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లొచ్చు!
Read Also: పైసా ఖర్చులేకుండా ఏడాదిగా ట్రైన్ లో ఫ్రీ జర్నీ, ప్రయాణీకుడి తెలివికి రైల్వే అధికారుల షాక్!