Sunny Leone: ఈరోజుల్లో హీరోయిన్స్ కూడా తమ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాను చేయడానికి ఎంచుకుంటున్నారు. ఒకవేళ వాళ్లు గ్లామర్ క్వీన్స్‌గా గుర్తింపు సాధించినా కూడా అదే విధంగా తమ కెరీర్‌ను కంటిన్యూ చేయాలని అనుకోవడం లేదు. ఇప్పుడు సన్నీ లియోన్ కూడా తనపై పడిన గ్లామర్ క్వీన్ అనే ట్యాగ్‌ను తొలగించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హిందీలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా వివిధ కథలను, పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఇంతలోనే సన్నీకి హీరోయిన్‌గా ఆఫర్ వచ్చింది. అది కూడా ఒక పాన్ ఇండియా యాక్షన్ సినిమాలో. దానికోసం ఎంతైనా కష్టపడడానికి సిద్ధపడింది సన్నీ లియోన్.
అన్ని భాషల్లో విడుదల
సన్నీ లియోన్ (Sunny Leone) గ్లామర్ క్వీన్‌గా మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో వివిధ రకాల పాత్రలతో ఆకట్టుకుంది. ఎక్కువగా హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లనే కనిపించింది ఈ భామ. ఇప్పుడు మొదటిసారి ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటించడానికి మలయాళ దర్శకుడితో చేతులు కలిపింది. ఆ సినిమా పేరే ‘షేరో’. శ్రీజిత్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేరళలోని మున్నార్‌లో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇది సన్నీ లియోన్ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా మూవీ. ఇది మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. ‘షెరో’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యింది సన్నీ లియోన్. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను పంచుకుంది.
Also Read: రామ్ చరణ్ తో రొమాన్స్ కి సిద్ధమైన సాయిపల్లవి.. నిజమేనా..?
దెబ్బలు తగిలాయి
సన్నీ లియోన్ హిందీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన తర్వాతే ఆ భాషను నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇక తనకు సౌత్ భాషలపై అంత పట్టు లేదు. కానీ ‘షెరో’లో డైలాగ్స్‌ను సరిగ్గా చెప్పడం కోసం ఒక డైలాగ్ కోచ్ తనకు సాయం చేశాడని బయటపెట్టింది సన్నీ. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇందులో యాక్షన్ సీన్స్ అన్నీ నేను స్వయంగా చేశాను. ఒక సీన్‌లో చాలా బరువు ఉన్న కుర్చీని ఎత్తి పడేయాలి. అలాంటివి అస్సలు ఈజీ కాదు. ఒకానొక సందర్భంలో నేను కిందపడి దెబ్బలు కూడా తగిలాయి. కానీ యాక్షన్ సీన్స్ అంటే అంతే కదా.. ఎంత కష్టంగా ఉన్నా ముందుకు వెళ్లాల్సిందే’’ అని బయటపెట్టింది సన్నీ లియోన్.
అందరి సపోర్ట్‌తో
కొత్త భాషను నేర్చుకోవడంలో ‘షెరో’ (Shero) టీమ్ తనకు చాలా సాయం చేసిందని చెప్పుకొచ్చింది సన్నీ లియోన్. ‘‘ఈ సినిమా కోసం నేను చాలా నేచురల్‌గా కనిపించాలి. గతంలో ఏం చేశామన్నది ముఖ్యం కాదు. అందుకే ఈ సినిమాలో నా పాత్ర గురించి ఎక్కువగా అర్థం చేసుకోవడంపై ఫోకస్ పెట్టాను. దానిని రియల్‌గా చూపించడానికి ప్రయత్నించాను’’ అని తెలిపింది. ఇది మాత్రమే కాకుండా సన్నీ లియోన్‌కు మరెన్నో సౌత్ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ప్రభుదేవా హీరోగా నటించిన ‘పెట్టా ర్యాప్’ అనే చిత్రంలో కూడా చిన్న రోల్‌లో కనిపించి అలరించింది.
Here are some photos from the sets of #SunnyLeone’s upcoming South film '#Shero' 💯 pic.twitter.com/vX1t50I4oy
— Bollywood Buzz (@BollyTellyBuzz) November 24, 2024