BigTV English

Rajinikanth:-క్రికెట్‌పై మూవీలో సూప‌ర్‌స్టార్ … భారీ రెమ్యునరేష‌న్‌

Rajinikanth:-క్రికెట్‌పై మూవీలో సూప‌ర్‌స్టార్ … భారీ రెమ్యునరేష‌న్‌

Rajinikanth:-ఆట‌ల‌పై, ఆట‌గాళ్ల జీవిత చ‌రిత్ర‌ల‌పై సినిమాలు రూపొందుతూనే ఉన్నాయి వాటిని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇండియాలో ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న క్రికెట్‌పై సినిమాను రూపొందించ‌నున్నారు. సినిమా షూటింగ్‌ను కూడా షురూ చేశారు కూడా. ఇంత‌కీ ఆ సినిమాను డైరెక్ట్ చేయ‌బోయేదెవ‌రో కాదు.. ఆయ‌న కుమార్తె ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్‌. ఆ సినిమాయే లాల్ స‌లాం. హోలీ సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ను మేక‌ర్స్ స్టార్ట్ చేశారు.


ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న లాల్ స‌లాం సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోంది. నిజానికి ఈ సినిమాలో ర‌జినీకాంత్ పూర్తి స్థాయి పాత్ర‌లో నటించ‌టం లేదు. గెస్ట్ రోల్ మాత్ర‌మే చేస్తున్నారు. ఈ పాత్ర కోసం ర‌జినీ కేవ‌లం వారం రోజుల కాల్షీట్ మాత్ర‌మే కేటాయించారు. దీని కోసం ఆయ‌న ఏకంగా పాతిక కోట్ల రూపాయ‌ల‌ను రెమ్యూన‌రేష‌న్‌ను తీసుకుంటున్నార‌ట త‌లైవ‌ర్‌.

8 ఏళ్ల త‌ర్వాత ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ మెగా ఫోన్ ప‌డుతుంది. ఇందులో హీరోలుగా విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తున్నారు. మ‌రి ర‌జినీకాంత్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయ‌టానికి కార‌ణ‌మేంటి? అనే వివ‌రాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ప్ర‌స్తుతం రజినీకాంత్ జైల‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. మ‌రో వైపు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌లోనే ర‌జినీకాంత్.. జై భీమ్ పేమ్ టి.జె.జ్ఞాన‌వేల్ దర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×