BigTV English

SC on Jani Master: సుప్రీంకోర్టులో ఊరట.. ఊపిరి పీల్చుకున్న జానీ మాస్టర్.!

SC on Jani Master: సుప్రీంకోర్టులో ఊరట.. ఊపిరి పీల్చుకున్న జానీ మాస్టర్.!

SC on Jani Master :టాలీవుడ్ కొరియోగ్రాఫర్ గా పేరు దక్కించుకొని , శాండిల్ వుడ్ లో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్న బెస్ట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master). కోలీవుడ్ నుండి కూడా జాతీయ అవార్డు వచ్చినా.. అది వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీనికి కారణం లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్ట్ అవ్వడమే. తన దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న ఒక అమ్మాయి, జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ కేస్ ఫైల్ చేయించిన విషయం తెలిసిందే. దీంతో గత కొద్ది రోజులుగా జైల్లో ఉన్న జానీ మాస్టర్.. ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చారు.


బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..

అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 24న ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఆ కేసులోని ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్.. సుప్రీం కోర్టులో శుక్రవారం రోజు విచారణకు రాగా..జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం దానిని రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని కూడా స్పష్టం చేసింది.. దీంతో జానీ మాస్టర్ కి కాస్త ఊరట దొరికింది అని చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడే బెల్ మీద బయటకు వచ్చి పిల్లలను, భార్యను కలుసుకొని సంతోషంగా ఉన్న జానీ మాస్టర్ పై మళ్లీ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు కాస్త కొట్టివేసింది. దీంతో జానీ మాస్టర్, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


లైంగిక వేధింపుల కేసులో పట్టుబడ్డ జానీ మాస్టర్..

ఇక అసలు విషయంలోకి వెళితే.. 2017లో జానీ మాస్టర్.. తన దగ్గర పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశారని, అవుట్డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు ముంబై లోని ఒక హోటల్లో స్టే చేయగా.. ఆ హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత యువతి ఇటీవల రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఈ కంప్లైంట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో జీరో ఎఫ్ ఐ ఆర్ ని.. నార్సింగ్ పీ.ఎస్. కు ఫార్వర్డ్ చేశారు రాయదుర్గం పోలీసులు. అనంతరం విచారణ జరిపిన తర్వాత జానీ మాస్టర్ ను రిమాండ్ లో ఉంచారు. ముఖ్యంగా బాధిత యువతి తనను మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని, ఈ విషయం బయటకు చెబితే.. ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా బెదిరిస్తానని హెచ్చరించాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇందులో నిజానిజాలు తెలియదు కానీ ఈయన భార్య సుమలతతో పాటు ఆట సందీప్ భార్యతో పాటు పలువురు సెలబ్రిటీలు జానీ మాస్టర్ కు అండగా నిలిచారు. ఆయనకు జాతీయ అవార్డు రావడం చూసి కొంతమంది తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకపోతే జాతీయ అవార్డు ప్రకటించిన తర్వాత బెయిల్ కి అప్లై చేయగా లైంగిక ఆరోపణల కేసులో పట్టుబడడంతో నేషనల్ అవార్డు కమిటీ కూడా ఈయనకు జాతీయ అవార్డు క్యాన్సిల్ చేసింది. న్యాయస్థానం కూడా బెయిల్ రద్దు చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ బెయిల్ మీద రావడంతో, బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×