BigTV English
Advertisement

Suriya: అప్పుడు సంతోషంగా లేను.. మళ్లీ ప్రేమలో ఎలా పడాలి అని ఆలోచించాను

Suriya: అప్పుడు సంతోషంగా లేను.. మళ్లీ ప్రేమలో ఎలా పడాలి అని ఆలోచించాను

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కోలీవుడ్ లో ఆయనకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో.. తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది.  గజినీ నుంచి ఆ ఫ్యాన్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు.  తాజాగా సూర్య నటిస్తున్న చిత్రం కంగువ. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తుండగా.. అనిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తున్నాడు.


అంతేకాకుండా  మొట్ట మొదటిసారి సూర్య – కార్తీ ఈ సినిమాలో ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడనుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

Spirit: ప్రభాస్ బర్త్ డే.. స్పిరిట్ నుంచి స్పెషల్ పోస్టర్


ఇకపోతే తాజాగా సూర్య ముంబై లో ఏర్పాటు చేసిన గ్రీట్ అండ్ మీట్ లో పాల్గొన్నాడు. గత కొన్నేళ్లుగా సూర్య కుటుంబంతో కలిసి ముంబైలోనే ఉంటున్న విషయం తెల్సిందే.  పిల్లల చదువు కోసం ముంబైకు షిఫ్ట్ అయ్యినట్లు సూర్య – జ్యోతిక చెప్పినా.. తల్లిదండ్రులతో గొడవ వలనే ఈ జంట ముంబైకు మారిందని వార్తలు వచ్చాయి. ఇక అక్కడ ఉండడంతోనే ముందు ముంబై నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఈవెంట్ లో ఆకాశం నీ హద్దురా సినిమాకు ముందు తాను ఎలా ఉన్నాడు  అనేది సూర్య  చెప్పుకొచ్చాడు. ” ఆకాశం నీ హద్దురా  సినిమాకు ముందు కెరీర్ లో నేను చాలా నిరాశకు గురయ్యాను. నా ఇమేజ్ ను ఎలా మార్చుకోవాలి.. ? మళ్లీ నేను సినిమాతో ఎలా ప్రేమలో పడాలి.. ?  కెమెరా ముందు ఎలా సంతోషంగా ఉండాలి.. ? ఇదే ఆలోచించాను. ఆ సమయంలోనే సుధా కొంగర ఆకాశం నీ హద్దురా సినిమాతో వచ్చింది. ఆ సినిమా చేయడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. ఆ సినిమా తరువాత నాలో చాలా మార్పులు వచ్చాయి. నాకు చాలా కాలంగా హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీయాలని ఉండేది. కంగువ సినిమాతో ఆ కల నెరవేరింది.

Amaran Trailer: అప్పుడు మేజర్ సందీప్.. ఇప్పుడు మేజర్ ముకుంద్.. అదిరిపోయిన ట్రైలర్

బ్రేవ్ హార్ట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి  హాలీవుడ్ సినిమాలను చూసి ఇష్టపడుతుంటాం. అలాంటి సినిమాలు చేయాలనీ కోరుకుంటాం. ఇక మనమెప్పుడు ఈ రేంజ్ లో సినిమాలు తీయాలి అనుకుంటున్నప్పుడు శివ ఒక కొత్త కథతో నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఉన్న ప్రపంచానికి వందేళ్లు వెనక్కి వెళితే ఎలా ఉంటుంది.. ? అప్పటి పరిస్థితిలు ఎలా ఉండేవి.. ?.. అప్పటి ప్రజలు ఎలా జీవించేవారు.. ? అనేవి తెరపై చూపిస్తే బావుంటుంది అని చెప్పాడు. అలా కంగువ పట్టాలెక్కింది. ఇక తన మనసులో అనుకున్న కథ, విజువల్స్ అదేవిధంగా వచ్చేవరకు శివ వెనక్కి తగ్గలేదు. ఆయన గొప్ప దర్శకుడు” అని చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం సూర్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×