Suriya latest news(Cinema news in telugu): కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన చేతిలో కంగువ, సూర్య44 చిత్రాలు ఉన్నాయి. కంగువ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. సూర్య 44 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్ లో సూర్య ప్రమాదానికి గురయ్యినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంది.
సెట్ లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న నేపథ్యంలో సూర్య తలకు గాయం అయ్యిందని సమాచారం, వెంటనే చిత్ర యూనిట్ సూర్యను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సూర్యకు ఏమైంది అని సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.
ఇక అభిమానుల ఆందోళన గ్రహించిన చిత్ర బృందం.. సూర్య ప్రమాదం గురించి స్పందించింది. 2D ఎంటర్టైన్మెంట్స్ సీఈఓ రాజశేఖర్ పాండియన్ సూర్య హెల్త్ అప్డేట్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. “ఇది చిన్న గాయం. దయచేసి చింతించకండి, సూర్య అన్న మీ అందరి ప్రేమ మరియు ప్రార్థనలతో సంపూర్ణంగా బాగున్నాడు” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక సూర్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సూర్య నటించిన కంగువ అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది. ఈ సినిమ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Dear #AnbaanaFans, It was a minor injury. Pls don’t worry, Suriya Anna is perfectly fine with all your love and prayers. 🙏🏼
— Rajsekar Pandian (@rajsekarpandian) August 9, 2024