BigTV English

Kanguva Movie Review : కంగువ మూవీ రివ్యూ

Kanguva Movie Review : కంగువ మూవీ రివ్యూ

సినిమా : కంగువ
విడుదల తేదీ : 14 నవంబర్ 2024
దర్శకుడు : శివ
నటీనటులు : సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ తదితరులు
నిర్మాతలు : కె. ఇ. జ్ఞానవేల్ రాజా, V. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
మ్యూజిక్ : దేవీ శ్రీ ప్రసాద్


Kanguva Movie Rating : 1/5

Kanguva Movie Review and Rating : గోపీచంద్ తో ‘శౌర్యం’ ‘శంఖం’ వంటి మాస్ సినిమాలు తీసి పర్వాలేదు అనిపించిన దర్శకుడు శివ.. ఆ తర్వాత రవితేజతో ‘దరువు’ అనే సినిమా తీసి మర్చిపోలేని ప్లాప్ ఇచ్చాడు. దీంతో అతనితో సినిమాలు చేయడానికి తెలుగు నిర్మాతలు, హీరోలు భయపడ్డారు. అయితే వెంటనే అతని సొంత గడ్డ అయినటువంటి తమిళనాడుకి చెక్కేసి అక్కడ కార్తీతో ‘విక్రమార్కుడు’ ని ‘సిరుతై’ గా రీమేక్ చేశాడు. దీంతో అజిత్ పిలిచి 3 సినిమాలకి ఛాన్స్ ఇచ్చాడు. అలా అతను అక్కడ స్టార్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు. ఇతనికి సూర్య ‘కంగువా’ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి విపరీతమైన హైప్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్స్ లో కంటెంట్ ఏంటో చెప్పకుండా విజువల్స్ తో మ్యాజిక్ చేసి ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.ఆ ప్రయత్నం ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడానికి వర్కౌట్ అయ్యింది. అయితే వాళ్ళని రంజింపజేసిందా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…


కథ :
ఫ్రాన్సిస్ ఓ బౌంటీ హంటర్. క్రిమినల్స్ ని పట్టించి పోలీసుల వద్ద లక్షల్లో రివార్డ్ మనీ తీసుకుంటూ ఉంటాడు. అయితే అతను ఓ క్రిమినల్ ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా అతన్ని తన అసిస్టెంట్ యోగిబాబు గన్ తో కాల్చి చంపేస్తాడు. ఇది ఒక పిల్లాడు జెటా చూస్తాడు.అయినప్పటికీ ఆ పిల్లాడిని పట్టించుకోకుండా ఫ్రాన్సిస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంజెల్(దిశా పటాని) ఫ్రాన్సిస్..ని చనిపోయిన క్రిమినల్ బంధువుకి అప్పగించాలని, తద్వారా డబ్బులు కొట్టేయాలని చూస్తుంది. మరోపక్క జెటా కోసం కొంతమంది క్రిమినల్స్ వచ్చి అతన్ని తీసుకుపోయి హతమార్చాలి అనుకుంటారు. ఆ పిల్లాడు అంటే ఫ్రాన్సిస్ కి తెలీని ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడుతుంది? అది ఎందుకు? అసలు ఆ పిల్లాడు ఎవరు? అతన్ని చంపాలని ఎందుకు జనాలు చూస్తున్నారు? ఫ్రాన్సిస్ అతనిపై ఎందుకు ప్రేమ పెంచుకున్నాడు? మధ్యలో ‘కంగువా’ పాత్ర ఏంటి? ఈ చిక్కుముడులకి సమాధానమే ‘కంగువా’ చిత్రం.

విశ్లేషణ :
‘సిరుతై’ శివని ఓ రకంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే సూర్య చాలా గొప్ప నటుడు.ఎలాంటి పాత్రకైనా వంద శాతం న్యాయం చేస్తుంటాడు. ఇంకో రకంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తాడు అని చెప్పాలి. దర్శకుడు హరి తీసిన ‘సింగం’ సిరీస్ లో కూడా సూర్య నటన ఓవర్ గా అనిపించదు. అలాంటి సూర్యతో ‘కంగువా’ లో టాప్ నాచ్ లో ఓవర్ యాక్షన్ చేయించాడు. అలా సూర్య ఓవర్ యాక్షన్ కూడా చేయగలడు అని సినిమా మొదలైన మొదటి 15 నిమిషాల్లోనే చూపించేశాడు. అలాగే ఆ మొదటి 15 నిమిషాలకే ఒక డౌట్ అందరికీ వస్తుంది. ఇది శివ డైరెక్ట్ చేసిన సినిమానా ? లేక లారెన్స్ డైరెక్ట్ చేసిన సినిమానా అని? లారెన్స్ సినిమాల్లోనే యాక్టర్స్ అంతా ఓవర్ యాక్షన్ చేస్తారు అనే నమ్మకం జనాల్లో ఉంది కదా. ఇప్పుడు శివ కూడా అతని ప్లేస్ ను భర్తీ చేశాడు అని చెప్పొచ్చు. 20 నిమిషాల తర్వాత సినిమాలో ఏదో ఉంటుందిలే అనే ఆలోచన వస్తుంది. అది అపోహ అని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడే క్లైమాక్స్ లా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ ఏమైనా ఆకట్టుకునేలా ఉంటుందా? అంటే మొదటి 15 నిమిషాలకే దానిపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. క్లైమాక్స్ లో కార్తీని రప్పించి సీక్వెల్ ఉండబోతుంది అని హింట్ ఇచ్చారు. వాస్తవానికి సెకండ్ హాఫె సెకండ్ పార్ట్ లా ఉంది. సినిమాకి ఫైట్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ కష్టపడి పనిచేశారు. వాళ్ళ పనితనాన్ని తీసేస్తే ఇంకో హైలెట్ లేదు. దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా రిపీటెడ్ గా అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. సూర్య ప్రాణం పెట్టి పనిచేశాడు. కానీ అతని కష్టాన్ని దర్శకుడు అవమానించినట్టే అయ్యింది. హీరోయిన్ దిశా పటానిని.. పాన్ ఇండియా సినిమా కాబట్టి పెట్టుకున్నట్టు ఉన్నారు. అంతే అంతకు మించి ఆమె గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. యోగిబాబు కామెడీ తేలిపోయింది. బాబీ డియోల్ క్రూరంగా కనిపించాడు. కానీ అతన్ని కూడా డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు. మిగిలిన నటీనటుల్లో ఎవ్వరూ గుర్తుండరు. చివర్లో ఎంట్రీ ఇచ్చిన కార్తీ కూడా మెరుపులు మెరిపించలేకపోయాడు.

ప్లస్ పాయింట్స్ :

విజువల్స్
కొన్ని యాక్షన్ సీన్లు

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సెకండాఫ్

మొత్తంగా ‘కంగువ’ ఏ దశలోనూ ఆకట్టుకోని ఓ బోరింగ్ పీరియాడిక్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. చాలా ఓపిక ఉంటే తప్ప దీన్ని చివరి వరకు చూడటం కష్టం.

Kanguva Movie Rating : 1/5

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×