BigTV English

Canada Hindus Protection: హిందువుల భద్రత కోసం 70000 డాలర్లు డిమాండ్ చేసిన కెనడా పోలీసులు

Canada Hindus Protection: హిందువుల భద్రత కోసం 70000 డాలర్లు డిమాండ్ చేసిన కెనడా పోలీసులు

Canada Hindus Protection| కెనడాలో నివసించే హిందువులు భద్రత సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలు హిందూ సంస్థలపై అక్కడ మెజారిటీలో ఉన్న సిక్కు, ఖలిస్తానీ అతివాదులు దాడులు చేస్తున్నారు. తాజాగా బ్రాంప్టన్ నగరంలో హిందూ సభా దేవాలయంలో కూడా పూజా కార్యక్రమాలు చేస్తున్న హిందువులపై ఖలిస్తానీ అల్లరిమూకలు దాడులు చేశాయి. ఈ క్రమంలో భారత ఎంబసీ ఆధ్వర్యంలో కొన్ని హిందూ సంస్థలు కౌన్సులార్ క్యాంప్స్ చేపట్టాయి. ఈ కాంప్స్ పై కూడా కొన్ని అల్లరి మూకలు దాడులు చేయడంతో కెనడా పోలీసులు సరైన భద్రత కల్పించడంలో విఫలమైనట్లు భారత ఎంబసీ ఆరోపణలు చేసింది. స్థానిక మీడియా రిపోర్ట్ ప్రకారం కెనడా పోలీసులు కౌన్సులార్ క్యాంప్స్ భద్రత కోసం హిందూ సంస్థల నుంచి 70000 డాలర్లు డిమాండ్ చేశారు. కానీ వారికి అంత మొత్తం చెల్లించకపోవడంతో కెనడా పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని సమాచారం.


దీంతో భద్రత కల్పించడానికి కెనడా పోలీసులు డబ్బులు డిమాండ్ చేయడం తమ పౌర హక్కులకు భంగం కలిగించడమేనని హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. మీడియా రిపోర్ట్ ప్రకారం.. కెనడా పోలీసులపై ఖలిస్తానీ గ్రూపు చెందిన నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. భారత ఎంబసీ చేపట్టే కౌన్సులార్ క్యాంప్స్ అనుమతులు ఇవ్వకూడదని పోలీసులపై ఖలిస్తానీ నాయకులు ఒత్తిడి చేసినట్లు తెలిసింది.

Also Read: 29 మంది పిల్లలకు ఉరిశిక్ష!.. జైల్లో ఆహారం ఇవ్వకుండా వేధింపులు..


కెనడాలోని బ్రాంప్టన్ నగరం త్రివేణి హిందూ దేవాలయం ఆధ్వర్యంలో ఇటీవల ఇండియన్ ఎంబసీ కౌన్సులార్ క్యాంప్స్ రద్దు అయ్యాయి. ఈ క్యాంప్స్ రద్దు అయిన మూడు రోజుల తరువాతనే భద్రత కోసం పోలీసులు డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. కెనడాలోని ప్రధాన నగరమైన టొరొంటోలో నవంబర్ 17 కౌన్సులేట్ జెనెరల్ ఆఫ్ ఇండియా త్రివేణి టెంపుల్ పరిసరాల్లో లైఫ్ సర్టిఫికేట్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉండగా.. కార్యక్రమం సమయంలో హింసాత్మక నిరసనలు జరిగే అవకాశముందని అందుకే ఈవెంట్ రద్దు చేస్తున్నట్లు కెనడా పోలీసులు ప్రకటించారు.

ఇండియన్ కౌన్సులేట్ ప్రతీ సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ ఈవెంట్లు నిర్వహించి పెన్షన్లు అందిస్తుంది. అయితే కార్యక్రమం రద్దు కావడంపై త్రివేణి టెంపుల్ అధికారులు స్పందించారు. “మాకు పీల్ రీజినల్ పోలీసులు ఈ కార్యక్రమం రద్దు చేయాలని సూచించారు. లైఫ్ సర్టిఫికేట్ ఈవెంట్ సమయంలో భారీ స్థాయిలో హింసాత్మక నిరసనలు జరుగునున్నాయని.. ఆ సమయంలో దేవాలయంలో భారీ సంఖ్యలో భక్తులు, సామాన్య ప్రజలకు ప్రాణహాని ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ కార్యక్రమాన్ని రద్దు చేశారు. కెనడాలో హిందువులకు కనీసం దేవాలయాల్లో కూడా భద్రత లేకపోవడం బాధాకరమైన విషయం. ఈ అంశంపై పీల్ రిజినల్ పోలీస్ అధికారులను సంప్రదించాం. ప్రజలకు భద్రత హామీ ఇవ్వాలని కోరాము. అయితే దీనిపై పోలీసులు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.” అని చెప్పారు.

వారం రోజుల క్రితమే బ్రాంప్టన్ లోని హిందూ సభా దేవాలయంలో పూజలు చేస్తున్న భక్తులపై కొందరు ఖలిస్తానీ జెండాలు చేతబట్టుకొని దాడి చేశారు. ఆ తరువాత టొరొంటోలోని కౌన్సులేట్ జెనెరల్ ఆఫ్ ఇండియా ప్రకటన జారీ చేసింది. తాము ప్లాన్ చేసిన కౌన్సులార్ క్యాంప్స్ కు కెనడా పోలీసులు భద్రత కల్పించడానికి నిరకరించడంతో క్యాంప్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కొన్ని నెలల క్రితం భారత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ 2023లో కెనడా పౌరుడైన ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం కుట్ర ఉందని ఆయన చెప్పడంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. అయితే కెనడా ప్రధాని ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు చేస్తున్నారని భారత ప్రభుత్వం మండిపడింది. తద్వారా ఇండియాకు చెందిన అంబాసిడర్లను కెనడా ప్రభుత్వం తిరిగి పంపించేసింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×