Swag.. టాలీవుడ్ టాలెంట్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు (Sri Vishnu) ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. సామజవరగమన అనే సినిమాతో తన సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈయన, ఆ తర్వాత ఓం భీమ్ బుష్ అనే కామెడీ ఎంటర్టైన్మెంట్ తో వచ్చి ప్రేక్షకులను మరొకసారి అలరించారు. ఇదిలా ఉండగా తనకు రాజ రాజ చోరా సినిమాతో మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ హాసిత్ గోలీ (Hasith goli) తో స్వాగ్ (Swag ) అనే సినిమా చేస్తున్నారు శ్రీ విష్ణు. దసరా సెలవులను క్యాష్ చేసుకోవడానికి అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.
స్వాగ్ ట్రైలర్ రిలీజ్..
ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేసింది చిత్రబృందం. అందులో భాగంగానే తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.2:32 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో శ్రీ విష్ణు నాలుగు పాత్రలు చేసినట్లు తెలుస్తోంది. 4 టైం లైన్స్ లో ఈ సినిమా కథ ఉండనుంది అని సమాచారం. అందులో స్వాగనిక వంశ యువరాజుగా శ్రీ విష్ణు క్యారెక్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. దేశంలో ఏ మగాడైనా వాళ్ళకి మొక్కాల్సిందే అనే డైలాగుతో ఆ వంశ చరిత్రను చెప్పుకొచ్చారు. పురుషాధిక్యత నేపథ్యంలో ఈ సినిమా వచ్చినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది.
కన్ఫ్యూజన్ లో పడేసిన స్వాగ్..
ముఖ్యంగా శ్రీ విష్ణు సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి అనే నాలుగు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ట్రైలర్ అయితే విడుదల చేశారు కానీ పెద్దగా బజ్ లేనట్టు తెలుస్తోంది. వాస్తవానికి శ్రీ విష్ణు తన కెరీర్ లోనే మొదటిసారి ఇన్ని క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు..పైగా కొత్త కాన్సెప్ట్ కూడా.. ట్రైలర్ లో ఏది ఉందో.. ఏది లేదో అర్థం కాకుండా.. ఆకట్టుకుని ఆకట్టుకోనట్టు, నచ్చి నచ్చనట్టు కన్ఫ్యూజ్ గా ఉంది అని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు సినిమా చూస్తే ఒక క్లారిటీ వస్తుందని ఒక వర్గం ఆడియన్స్ చెబుతున్నారు.. మరి కొంతమంది ఈ కన్ఫ్యూజన్ మనకు అవసరమా అంటూ లైట్ తీసుకుంటున్నారు.
బజ్ లేదే.. మరి శ్రీ విష్ణు పరిస్థితి ఏంటి..
మరో ఐదు రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ తోనే కన్ఫ్యూజ్ క్రియేట్ చేసారు. అందుకే ఆడియన్స్ లో ఆసక్తి కూడా పెద్దగా కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాపై హైప్ పెంచాలి అంటే కచ్చితంగా ప్రమోషన్స్ పెంచాల్సి ఉంటుంది. నిజానికి స్వాగ్ అనేది టైటిల్ లో ఉంది కానీ ఈ సినిమా చూడడానికి అటు ఆడియన్స్ లో , సినిమా ప్రమోట్ చేయడానికి ఇటు చిత్ర బృందంలో ఎటువంటి స్వాగ్ కనిపించడం లేదు అనేది వాస్తవం అంటూ ఒక వర్గం ఆడియన్స్ చెబుతున్నారు. అసలే దేవర లాంటి భారీ బడ్జెట్ మూవీలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ .. దూసుకుపోతుంటే ఇప్పుడు ప్రమోషన్స్ చేయకుండా ఎవరికివారు సైలెంట్ అయిపోతున్నారు. మొత్తానికి అయితే ఈ స్వాగ్ పై ఎక్కడ కూడా బజ్ కనిపించడం లేదు. మరి శ్రీ విష్ణు మూవీ ఆడియన్స్ కి నచ్చలేదా..? లేక తన నటనతో శ్రీ విష్ణు మెప్పించడం లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అసలు బజ్ లేకుండా సినిమాను విడుదల చేస్తున్నారు మరి శ్రీ విష్ణు కి ఏ వరకు కలిసి వస్తుందో చూడాలి.