Dost Notification 2025: మీరు ఇంటర్ పూర్తి చేశారా? మీరు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందాలా? అయితే ఈ విలువైన సమాచారం మీకోసమే. మీరు ఈ పని చేయకుంటే మాత్రం, మీరు డిగ్రీ లో ప్రవేశం పొందలేరు. తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాల కొరకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యను పూర్తి చేసిన విద్యార్థుల కోసం దోస్త్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ ద్వారా ప్రవేశం పొందడమే ఈ నోటిఫికేషన్ ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం తెలిపిన వివరాల మేరకు ఇంటర్ విద్యార్థులు ఆయా డిగ్రీ కళాశాలల్లో సీటు పొందవచ్చు.
దోస్త్ 2025 అడ్మిషన్ షెడ్యూల్ ఇదే..
రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ దోస్త్ ద్వారా పలు విషయాలను వెల్లడించింది. ఫేజ్ I రిజిస్ట్రేషన్ లు మే 6 నుండి మే 25 వరకు జరగనున్నాయి. వెబ్ ఆప్షన్లు మే 15 నుండి మే 27 వరకు అవకాశం ఉంది. ఫేజ్ I కు సంబంధించి సీటు కేటాయింపు జూన్ 3గా ప్రభుత్వం నిర్ధారించింది. ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్ కు జూన్ 4 నుండి జూన్ 10 వరకు అవకాశం ఉంది/
రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం..
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.200/- చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులు, కళాశాలలను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవచ్చు. సీటు కేటాయింపు తర్వాత, సంబంధిత కళాశాలలో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ – రిపోర్టింగ్ చేయాలి.
Also Read: Today Gold Rate: బంగారం ధర ఢమాల్.. చూస్తుండగానే రూ.5 వేలు తగ్గిన పసిడి
అధికారిక వెబ్ సైట్ ఇదే..
ఇంటర్ మార్కులతో పాటు ఎంచుకునే కోర్సుల ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, JNTUH, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీల్లో బీఏ, బీకాం, BSC, BBA తదితర డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఇతర వివరాల కొరకు https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలి.