Bihar clock tower Stops Working| బిహార్ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారులు యదేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. దీనికి నిదర్శనంగా ఒక నూతన క్లాక్ టవర్ నిర్మాణం కనిపిస్తోంది. బీహార్‌లో కొత్తగా నిర్మించిన ఓ క్లాక్ టవర్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే పనిచేయడం లేదు. దీంతో ప్రభుత్వ పనితీరు పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజెన్లు వాడివేడిగా తెగ డిబేట్లు పెట్టేస్తున్నారు.
బీహార్ షరీఫ్‌లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.40 లక్షల వ్యయంతో ఒక కాంక్రిట్ క్లాక్ టవర్‌ను నిర్మించారు. ఈ క్లాక్ టవర్ ను స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓపెనింగ్ చేయడం గమనార్హం. సిఎం నితీశ్ కుమార్ చేపట్టిన ప్రగతి యాత్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దీని నిర్మానం జరిగింది. కానీ ఈ క్లాక్ టవర్ ని చూస్తే చాలా సాదాసీదాగా, నాసిరకం నిర్మాణంగా కనిపిస్తుండడంతో ఈ కట్టడాన్ని నిర్మించేందుకు రూ.40 లక్షలు ఖర్చు పెట్టామని చెబుతున్న ప్రభుత్వాధికారుల వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నెటిజెన్లు అయితే ఇది స్కూల్ పిల్లల ప్రాజెక్ట్ లాగా ఉంది. దీన్ని కట్టడానికి రూ.40 లక్షలు ఎలా ఖర్చు అవుతాయని ప్రశ్నించాడు.
ఈ నేపధ్యంలో ఎక్స్ వేదికపై ఓ వ్యక్తి ఫోటోలు పోస్ట్ చేస్తూ.. ‘‘పేలవంగా పెయింట్ వేసిన ఈ కాంక్రీట్ క్లాక్ టవర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద నిర్మించారు. ప్రారంభం 24 గంటల్లోనే దీని గడియారం పనిచేయడం లేదు. ఈ నిర్మాణానికి ఖర్చు ఎంతో మీరు ఊహించగలరా? ఈ అద్భుత నిర్మాణానికి కేవలం రూ.40 లక్షలు పెట్టరంట.. అధికారులకు హ్యాట్సాఫ్!’’ అని రాశాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
Also Read: 2 భర్తలు, 3 పిల్లలు.. మైనర్ ప్రేమికుడి కోసం హిందూ మతం స్వీకరించిన ముస్లిం యువతి
బీహార్‌లో అధికారుల అవినీతికి నిదర్శనంగా ఈ క్లాక్ టవర్‌ని చూసే నెటిజన్లు, బ్రిటీష్ కాలంలో నిర్మించబడిన క్లాక్ టవర్‌ను పోల్చుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో అధికారులు స్పందించారు. ‘‘దయచేసి అలాంటి పుకార్లను నమ్మవద్దు. ఈ క్లాక్ టవర్ డిజైన్, నిర్మాణ పనులు ఇంకా పూర్తవ్వలేదు’’ అని బీహార్ షరీఫ్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ అనే ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు.
అంతేకాదు.. ‘‘కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కొత్తగా నిర్మించిన క్లాక్ టవర్‌లోని కేబుల్లను దొంగిలించారని, దానిని తిరిగి ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంది. ఈ క్లాక్ టవర్ పూర్తి నిర్మాణం పూర్తయిన తర్వాతే పూర్గి స్థాయిలో ఈ కట్టడం ప్రారంభోత్సవం జరగనుంది’’ అని మరో పోస్ట్‌లో బీహార్ షరీఫ్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ పేర్కొంది.
Also Read: దళితుడు ప్రవేశించాడని ఆలయం శుద్ధి చేసిన బిజేపీ నాయకుడు.. రాహుల్ గాంధీ ఫైర్