BigTV English

Odela 2: ఘనంగా ఓదెల2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే..?

Odela 2: ఘనంగా ఓదెల2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే..?

Odela 2: మిల్కీ బ్యూటీ తమన్నా, హెబ్బా పటేల్, కీలక పాత్రలో నటించిన సినిమా ఓదెల 2. గతంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా ఈ సినిమా రానున్నది. అశోక్ తేజ దర్శకత్వం లో ,సంపత్ నంది ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఆ వివరాలు గురించి తెలుసుకుందాం..


ట్రైలర్ రిలీజ్ ఎక్కడంటే ..

మిల్కీ బ్యూటీ తమన్న నాగ సాధువు గా నటిస్తున్న చిత్రం ఓదెల 2. మహా కుంభమేళా లో విడుదల చేసిన టీజర్ కు, పోస్టర్ మంచి స్పందన వచ్చింది. తమన్నా సాధువు వేషంలో, సీరియస్ లుక్స్ తో, టీజర్ లో భయపెట్టారని చెప్పొచ్చు.ఇలాంటి పాత్రలో తమన్నా నటించటం ఇదే తొలిసారి .టీజర్ లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ . మొదటి పార్ట్ ను మించి, రెండో పార్ట్ ఉంటుందని ఈ టీజర్ చూసిన వారికి అర్థమవుతుంది.ఏప్రిల్ 17వ తేదీన సినిమా విడుదల కానుంది. అందులో భాగంగా మూవీ టీం కీలక అప్డేట్ ఇచ్చారు. ఓదెల 2 ట్రైలర్ ను ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముంబైలోని వెస్ట్ బాంద్రాలో గెలాక్సీ థియేటర్లో ఈ ట్రైలర్ లాంచ్ వేడుక జరగనుంది .ఈ సినిమా నిడివి విషయంలో కేర్ తీసుకోనున్న మూవీ టీం. ఫస్ట్ ఆఫ్ 71 నిమిషాలు ,సెకండ్ హాఫ్ 73 నిమిషాలు ఉండనుంది. రెండు నిమిషాల 40 సెకండ్ల టైలర్ ను రిలీజ్ చేయనున్నారు .ఈసారి వి ఎఫ్ ఎక్స్ మాయాజాలంతో మన ముందుకు రాబోతున్న సంపత్ నంది& టీమ్.ఈ ఈవెంట్ కు హీరోయిన్ హెబ్బా పటేల్,తమన్నా, మిగిలిన చిత్ర యూనిట్ అందరూ హాజరుకానున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ గా హిట్ కొట్టిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు ఇది సీక్వెల్. ప్రమోషన్స్ అన్ని నార్త్ లోనే జరుగుతున్నాయి. సంపత్ నంది ఈ సినిమాలో తమన్నా నటించకపోతే ,అసలు సినిమానే చేసే వాడిని కాదు .అనే వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి .


పార్ట్ 2 అన్ని వున్నాయా ..

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ను చుసిన వారికీ ఆధ్యాత్మిక కథతో, థ్రిల్లింగ్ అంశాలను చేర్చి, అద్వితీయ శక్తుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో తమన్నా గెటప్ అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. హెబ్బా పటేల్ ,వశిష్ట సింహ,యువ, నాగమహేష్, కీలక పాత్రల లో నటిస్తున్నారు. తమన్నా ఈ సినిమాలో భైరవి అనే పాత్రలో కనిపించనుంది.పార్ట్ వన్ లో ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న భర్తల తల నరికి చంపి వేయడంతో సినిమా ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో, రెండో పార్ట్ లో చూపించనున్నారు. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడం విశేషం. తెలుగు తో పాటు 5 భాషల్లో ఈ సినిమా రానుంది. ఈ సినిమా ట్రైలర్ ఈనెల 8వ తేదీన ముంబైలో రిలీజ్ చేస్తున్నారు కావున నార్త్ లో సందడి నెలకొంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×