Manchu Lakshmi: ఈరోజుల్లో సినీ సెలబ్రిటీలు చాలావరకు సైబర్ నేరగాళ్లకు బాధితులుగా మారుతున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల సోషల్ మీడియాలను హ్యాక్ చేసి అందులో నుండి తమ స్నేహితులను, కుటుంబ సభ్యులను డబ్బులు అడుగుతూ వారిని బాధితులుగా మారుస్తున్నారు దుండగులు. తాజాగా ఆ బాధితుల లిస్ట్‌లోకి మంచు లక్ష్మి కూడా యాడ్ అయ్యింది. మామూలుగానే మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాంటి తన ఇన్‌స్టాగ్రామ్‌ను హ్యాక్ చేసి తన స్నేహితులను డబ్బులు అడిగారు సైబర్ నేరగాళ్లు. ఇదే విషయాన్ని తన ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ డబ్బులు కావాలంటే డైరెక్ట్‌గా అడుగుతాను అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. తన నేరుతో తన స్నేహితులను డబ్బులు అడిగిన స్క్రీన్‌షాట్స్ పెట్టి అదంతా అబద్ధం అని ప్రూవ్ చేసింది.
ట్రేడింగ్ ప్రమోషన్
మంచు లక్ష్మి తరచుగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటుంది. అందుకే తనే హ్యాకర్లకు టార్గెట్ అయ్యింది. తాజాగా తను ఒక ట్రేడింగ్ పేజ్‌ను ప్రమోట్ చేస్తున్నట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది. అందులో తన ఫ్రెండ్ తనకు ఒక ట్రేడింగ్ పేజ్ గురించి చెప్పాడని, అది చాలా నమ్మదగినది అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తను ఆ ట్రేడింగ్ కంపెనీ ద్వారా రూ.3 లక్షలు లాభం కూడా పొందిందని ఆ స్టోరీలో ఉంది. ఇదంతా చూసిన తర్వాత మంచు లక్ష్మి ఏంటి ఇలాంటి స్టోరీ షేర్ చేసిందని అందరూ అనుకున్నారు. మొత్తానికి అది హ్యాకర్ల పని అని తను క్లారిటీ ఇచ్చేసింది.
My Instagram account is hacked.@instagram help me in getting it back. pic.twitter.com/oUGE1LXo9w
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025
ఎన్నో స్టోరీలు
మంచు లక్ష్మి ఆ ట్రేడింగ్ కంపెనీ గురించి ఒకటి కాదు.. చాలానే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు షేర్ చేసింది. అవన్నీ చూసిన తర్వాత ఫాలోవర్స్‌కు వెంటనే అనుమానం వచ్చింది. తను ఆ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందినట్టుగా ఈ స్టోరీల్లో ఉంది. అందుకే ఈ స్టోరీలు అన్నింటిని స్కీన్‌షాట్ తీసి ఇది తను చేసింది కాదు అని హ్యాకర్ల పని అని క్లారిటీ ఇచ్చేసింది మంచు లక్ష్మి. దీంతో నెటిజన్ల అనుమానమే నిజమయ్యింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని ట్వీట్ చేయడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ను ట్యాగ్ చేసి త్వరగా దీనికి పరిష్కారం చూపించమని కోరింది మంచు లక్ష్మి. దీంతో ఈ స్టోరీలు షేర్ చేసింది తను కాదని అందరికీ స్పష్టమయ్యింది.
Also Read: ‘శివాజి’ మూవీలో కనిపించిన ఈ అక్కాచెల్లెలు గుర్తున్నారా.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే షాక్..
డైరెక్ట్‌గా అడుగుతాను
‘నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. నా స్టోరీల్లో కనిపించే వాటికి దూరంగా ఉండండి. నాకు డబ్బులు కావాలంటే నేరుగా అడుగుతాను. సోషల్ మీడియాలో కాదు. ఇన్‌స్టాగ్రామ్ మళ్లీ మామూలుగా అయిన తర్వాత మరోసారి ట్వీట్ చేస్తాను’ అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి (Manchu Lakshmi). దీంతో ఇలాంటి సమయంలో కూడా మంచు లక్ష్మి జోకులు వేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే ఇందులో మంచు విష్ణు హస్తం ఉందేమో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం స్టోరీల్లోనే కాదు.. మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ నుండి పలువురు ఫాలోవర్స్‌కు డబ్బులు అడుగుతూ మెసేజ్‌లు కూడా వెళ్లాయని తెలుస్తోంది.
My Instagram has been hacked. Kindly do not engage with anything that is on my stories.
If I need money, I will ask you directly not on social media 😂
Will tweet once I get it all back in order…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025