Nani:అక్కినేని వారసుడు కింగ్ నాగార్జున (Nagarjuna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దాలు అవుతున్నా.. ఆయన వయసు 60 సంవత్సరాలు దాటినా..ఇంకా అదే యవ్వనం.. అదే ఫిట్నెస్.. చాలా చక్కగా మైంటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో కలిగే మార్పుల కారణంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం లేదా మరికొన్ని ఆరోగ్య సమస్యలతో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతూ ఉంటారు.. కానీ నాగార్జున మాత్రం ఇన్నేళ్లు అవుతున్నా..తన అందం విషయంలో ఏమాత్రం మార్పు రాకుండా.. చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ తెలుసుకోవడానికి అభిమానులే కాదు స్టార్ సెలబ్రిటీలు కూడా తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు..అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని(Nani ) కూడా ఒకరు.
నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన నాని..
నాని ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవారు.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే మాత్రం ఇంతలోనే అంత మార్పా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన మొదటి సినిమాను ఇప్పటి సినిమాలను కంపేర్ చేస్తే..ఆయనలో ఎంత మార్పు వచ్చిందో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఆయన శరీరంలోనే కాదు చిత్రాల ఎంపిక విషయంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇకపోతే నాని కూడా ఎన్నోసార్లు నాగార్జున లాగా ఉండాలి అని, ఆయన ఫిట్నెస్ గురించి తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారట. కానీ కుదరలేదు. అయితే ఒకసారి ఏకంగా నాగార్జునతో ‘దేవదాసు’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.ఈసారి ఎలాగైనా సరే నాగార్జున ఫిట్నెస్ ఏంటో తెలుసుకోవాలని తెగ ప్రయత్నం చేశారట. అందులో భాగంగానే ఆయన ఏం స్నాక్స్ తిన్నా.. ఎలాంటి జ్యూస్ తాగినా..లేదా ఆహారంలో ఏం తీసుకున్నా సరే వెంటనే తన అసిస్టెంట్ తో చెప్పి నాగార్జున గారు ఏం తింటున్నారు..? ఏం తాగుతున్నారు..? తెలుసుకోమని చెప్పేవారట. ఇక ఆ అసిస్టెంట్ కూడా మనలాగే మనం తినేవే ఆయన కూడా తింటున్నారు సార్ అని తనతో ఎన్నోసార్లు చెప్పారు. ఇక ఒకరోజు ఆగలేక ఆయనను అడిగితే.. నేను ఏ క్షణమైనా సరే సంతోషంగా ఉంటా.. అదే నన్ను ఇంత యంగ్గా ఫిట్ గా మార్చిందని చెప్పారు అంటూ దేవదాస్ సినిమా ఈవెంట్లో నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు నాని.. ఏది ఏమైనా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి వారైనా ఎంత వయసొచ్చినా అంతే యవ్వనంగా కనిపిస్తారని.. దీనికి నాగార్జున ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నాని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం నాగార్జున ఫిట్నెస్ మంత్ర తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అలా చేస్తే నిత్య యవ్వనం మీ సొంతం..
కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. అంతమాత్రాన జీవితం అక్కడితో ఆగిపోదు కదా.. ప్రతిక్షణం మనకంటూ వేచి ఉండదు.. ఆ క్షణం కోసం మనమే పరిగెత్తాలి. కష్టమైనా.. నష్టమైనా..ప్రతిక్షణాన్ని ఆనందంగా మలుచుకున్నప్పుడే.. జీవితం ఇంకొన్నాళ్లు బాగుంటుంది అని ఇప్పటికే పలువురు మహానుభావులు కూడా నిరూపించారు. కాబట్టి ఎవరు ఎలా ఉన్నా సరే మీరు మాత్రం నిత్యం సంతోషంగా ఉంటే.. ఆ సంతోషమే మిమ్మల్ని మరింత ఆరోగ్యవంతులుగా మారుస్తుంది.
Odela 2 Censor: ఓదెల 2 సెన్సార్ రిపోర్ట్.. మరీ ఇంత బూతా.. కట్ చేసి పడేసిన సెన్సార్.!