Tamannah : బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma)తో తమన్నా (Tamannah Bhatia) చాలాకాలం నుంచి రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మీరిద్దరూ విడిపోయారంటూ నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. రెండేళ్ల ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసి, ఇకపై స్నేహితులుగా కొనసాగాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు అనేది ఆ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫస్ట్ టైం బ్రేకప్ పై తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె రిలేషన్ అంటే బిజినెస్ లాంటిది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేయడం గమనార్హం.
రిలేషన్ అంటే బిజినెస్ లాంటిది
తమన్నా – విజయ్ వర్మ విడిపోయారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తమన్నా ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె ప్రేమ, రిలేషన్షిప్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. “ప్రేమించే వాడిని కాస్త తెలివిగా సెలెక్ట్ చేసుకోండి. ఒకరకంగా రిలేషన్షిప్ అనేది ఓ బిజినెస్ ట్రాన్సాక్షన్ లాంటిది” అంటూ తమన్నా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆమె ఎక్కడా విజయ్ వర్మ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ, తమన్నా చేసిన కామెంట్స్ అతన్ని ఉద్దేశించే అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తమన్నా ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేసింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
బేకప్ కు ఇదే కారణమా ?
కెరీర్, పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు మొదలవ్వడమే బ్రేకప్ కు కారణమని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న తమన్నా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలని అనుకున్నారట. అదే నిర్ణయాన్ని విజయ్ వర్మతో చెప్తే ఆయన మాత్రం ఒప్పుకోలేదట. ప్రస్తుతానికి విజయ్ వర్మ కెరీర్ పైనే దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని, అందుకే బ్రేకప్ అయ్యిందని అంటున్నారు. కానీ ఈ వార్తలపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక 2023 లో రిలీజ్ అయిన ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ లో ఇద్దరూ కలిసి ఫస్ట్ టైమ్ పని చేశారు. షూటింగ్ పూర్తయ్యాక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న రూమర్లు మొదలయ్యాయి. ఇక పలు సందర్భాల్లో ఈ జంట తమ రిలేషన్ ను బయట పెట్టిన సంగతి తెలిసిందే. రిలేషన్షిప్ పై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చాక విజయ్ వర్మ తమన్నా ఇద్దరూ కలిసి పలు సినిమా ఈవెంట్స్ తో పాటు ఫ్యాషన్ షోలు, ఇతర కార్యక్రమాలకు కలిసే హాజరయ్యారు. ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే రూమర్లు వినిపిస్తున్న నేపథ్యంలో బ్రేకప్ రూమర్లు తెరపైకి వచ్చాయి.
‘ఐఫా డిజిటల్ అవార్డ్స్’లో బిజీగా విజయ్ వర్మ
ఓవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విజయ్ వర్మ మరోవైపు ‘ఐఫా డిజిటల్ అవార్డ్స్’కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం ప్రస్తుతం ఆయన జైపూర్లో రిహార్సల్స్ మొదలు పెట్టారు. మరోవైపు తమన్నా ‘ఓదెల 2’ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.