Palasa Fame Director Karun Kumar : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో తరుణ్ భాస్కర్ ఒకరు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడుగా మారాడు. సైన్మ అనే ఒక షార్ట్ ఫిలిం తీశాడు తరుణ్. అప్పట్లో ఈ షార్ట్ ఫిలిం బాగా పాపులర్ అయింది. ఇక పెళ్లిచూపులు సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలు కూడా కంటెంట్ ఉంటే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అనడానికి నిదర్శనం పెళ్లి చూపులు సినిమా. ఆ సినిమాతో ఒక్కసారిగా తరుణ్ భాస్కర్ కి విపరీతంగా అవకాశాలు వచ్చాయి. ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా సినిమాలో క్యారెక్టర్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యాయి.
అప్పుడు సినిమాలలో తెలంగాణ యాసను కొంతమంది కమెడియన్స్ మాత్రమే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. శ్రీను వైట్ల లాంటి దర్శకులు సినిమాలలో తెలంగాణ యాస బాగా వినిపించేది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన దూకుడు సినిమాలో మహేష్ బాబు కంప్లీట్ తెలంగాణ యాస మాట్లాడుతాడు. ఇక పెళ్లిచూపులు విషయానికి వచ్చేసరికి ఆ యాస లో బ్యూటీ ఏంటో చాలామందికి తెలిసి వచ్చింది. ఆ సినిమా తర్వాత తరుణ్ చేసిన అన్ని సినిమాల్లో కూడా అదే యాస వినిపిస్తూ వచ్చింది. తరుణ్ ఒకవైపు దర్శకుడు గానే కాకుండా నటుడుగా కూడా మంచి పేరును సాధించుకున్నాడు. ఇక రీసెంట్ పలాస సినిమా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ నేను పలాస సినిమా తీయడానికి ఇన్స్పిరేషన్ తరుణ్ భాస్కర్ అని చెబుతూ వచ్చాడు.
Also Read : Pawan Kalyan: కిక్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ కోసమే సిద్ధం చేసారట
కరుణ కుమార్ ప్రస్తుతం మట్కా అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంతకుముందు శ్రీకాకుళం యాసను కమెడియన్స్, గుండాల పక్కన ఉండే వాళ్లు , అలానే పనిమనుషులు మాట్లాడుతూ ఉండేవాళ్లు. అందుకని నేను కంప్లీట్ గా పలాస సినిమా శ్రీకాకుళం యాస లో తీయాలనే ప్రయత్నం చేశాను. తెలంగాణ యాసను తక్కువగా మాట్లాడుతున్న టైం లో మాకు కూడా రక్త మాంసాలు ఉన్నాయి అంటూ తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు పెళ్లిచూపులు సినిమాను తీశారు. నేను పెళ్లి చూపులు సినిమా చూసి పలాస సినిమా తీయాలని అనుకున్నాను ఒక రకంగా నాకు ఇన్స్పిరేషన్ తరుణ్ భాస్కర్ అని చెబుతూ వచ్చాడు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తర్వాత కరుణ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మట్కా సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. మట్కా రిలీజ్ అవుతున్న రోజున సూర్య నటించిన కంగువ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఆ పోటీని తట్టుకుని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి.