E-Paper
Advertisement

Mirai Movie: ‘హనుమాన్’ రూట్ లోనే ‘మిరాయ్’.. ఇదేం మ్యాజిక్ సజ్జా!

Mirai Movie: ‘హనుమాన్’ రూట్ లోనే ‘మిరాయ్’.. ఇదేం మ్యాజిక్ సజ్జా!
Advertisement

Mirai Movie: ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో కొచ్చి భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే చిన్న సినిమాల హవా నడుస్తుంది. గతేడాది చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ సక్సెస్ అవ్వడంతో పాటుగా బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కలెక్షన్స్ ను కూడా వసూల్ చేసింది. ఈ మూవీలో హీరోగా తేజ సజ్జ నటించారు. ప్రస్తుతం ఈయన మిరాయ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. తేజా సజ్జా హీరోగా వస్తున్న ఈ సూపర్ యోధ కథపై, అఫిషియల్ టీజర్ రాకముందే ఓ మోస్తరు బజ్ కలగడమేకాదు, బుక్ మై షో లో 25 వేల మందికి పైగా ఇంటరెస్ట్ చూపించడం సినీ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. అయితే ఈ సినిమా కోసం తేజ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. హనుమాన్ దారిలోని నడిచాలని ఫిక్స్ అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది..

సూపర్ యోధ కాన్సెప్ట్ తో తేజా మూవీ..

Advertisement

ఈరోజుల్లో భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు ప్రమోషన్స్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నాయి. గత రెండేళ్లుగా చిన్న సినిమాగా వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ని శాసిస్తున్నాయి. తేజా సజ్జా నటించిన హనుమాన్ మూవీ ప్రమోషన్స్ లో పెద్ద హడావిడి చెయ్యలేదు. సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో తేజా కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఆ మూవీస్ అంతగా పేరును అందించలేదు. హనుమాన్ తర్వాత ఈ హీరో రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు సూపర్ పవర్స్ కాన్సెప్ట్ తో చేస్తున్న మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Also Read : బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది.. రామ్ చరణ్ ఏమున్నాడ్రా బాబు..

Advertisement

తేజా సజ్జా షాకింగ్ నిర్ణయం..?

తేజా నటిస్తున్న మిరాయ్ కోసం హనుమాన్ ఫార్ములాను అప్లై చేస్తున్నాడని ఫిలిం నగర్లో టాక్.. ఆ సినిమా తో అతను పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పుడు ఆ రూట్లోనే మిరాయ్ కూడా సైలెంట్ గానే తన మార్క్ ను చూపెడుతోంది. తక్కువ ఖర్చుతో, అధిక నమ్మకంతో చేసిన సినిమా ఎలా హైప్ క్రియేట్ చేయాలో చూపించిన ‘హనుమాన్’ తరహా హిట్, మరోసారి తేజా ఖాతాలో పడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఫిలిం నగర్లో ఇదే వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ హీరోలతో పోల్చుకుంటే మిరాయ్ ఓ ప్రాచీన భావనతో మిక్స్ చేసిన కథగా వుంటుందనే ఊహలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి తోడు, తేజా ఎంచుకుంటున్న స్క్రిప్ట్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉండటం వల్ల ప్రేక్షకుల్లో ఈ ఫిల్మ్ పై ఒక ఆసక్తి పెరుగుతోంది.. పెద్ద సినిమాల మధ్య ఓ చిన్న హీరో సినిమా ఇలా తన స్థానం సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. తేజా కష్టానికి అదృష్టం పడుతుందా?.. మరి ఏడాది హనుమాన్ లాగే మిరాయి కూడా సైలెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×