PM Modi Saudi Visit Pahalgam| ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా యాత్రలో ఉండగా.. మంగళవారం జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు సామాన్యులపై దాడులు చేశారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. విదేశీ యాత్రపై ఉన్న మోదీ ఈ వార్త తెలిశాక సౌదీ యాత్ర త్వరగా ముగించుకొని బుధవారం ఉదయం తిరిగి న్యూ ఢిల్లీ చేరుకున్నారు.
ప్రధాని మోడీ ఉగ్రవాద దాడి ఘటన గురించి జాతీయ భద్రతా విభాగం కేబినెట్ కమిటీతో కలిసి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోనే సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవాల్, ఫారిన్ సెక్రటరీ విక్రం మిస్రీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో దాడులు చేసిన ఉగ్రవాదులను హత మార్చేందుకు చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు.
అంతకుముందు రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి మోడీ అక్కడి రాజు ఇచ్చిన విందుని కూడా హాజరు కాలేదు. జమ్ము కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిందని తెలియగానే త్వరగా అక్కడి కార్యక్రమాలు ముగించుకున్నారు. మరోవైపు పహల్గాంలో ఉగ్రవాదుల కోసం భారత సైన్యం గాలింపులు చేపట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్ ఐ ఏ బృందం కూడా కశ్మీర్ కు బయలుదేరారు. ఉగ్రవాది దాడుల్లో చనిపోయిన వారిని రాజధాని శ్రీనగర్ కు తరలించడం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని సమీపం ఆస్పత్రులకు తరలించారు. ఇంతకు ముందు ఇలా టూరిస్టులపై గత సంవత్సరం మే నెలలో దాడులు జరిగాయి. అప్పుడు కూడా పహల్గాం లోనే దాడులు జరగడం గమనార్హం.
Also Read: వెళ్లి మోడీకి చెప్పుకో.. భర్తను చంపి భార్యతో టెర్రరిస్ట్ చెప్పిన మాటలు ఇవే!
జమ్మూ కశ్మీర్ లోని కీలక ప్రాంతాల్లో ప్రస్తుతం కర్ఫూ లాంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జమ్మూ ప్రదేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. దోడా పట్టణంలో మంగళవారం సనాతన ధరం సభకు చెందిన కిశ్వర్ యూనిట్ నిరసన చేపట్టింది. ఉగ్రవాద దాడులకు నిరసనగా బుధవారం బంద్ చేపట్టాలని పిలుపునిచ్చింది. జమ్మూలోని గుజ్జర్ ప్రాంతానికి చెందని ముస్లిం సమాజం కూడా ఉగ్రవాద దాడులను ఖండిస్తూ.. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేసింది.
జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై దాడి చేసిన ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ ఉగ్రసంస్థ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడింది. మొదట ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు నిర్వహించిన ఈ సంస్థ, లష్కరే తోయిబా తదితర ఉగ్రసంస్థల నుంచి సభ్యులను చేర్చుకుని భౌతికంగా ఏర్పడింది. టీఆర్‌ఎఫ్‌ను పాకిస్తాన్ ఐఎస్‌ఐ ప్రోత్సహించిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎఫ్‌ను 2019లో స్థాపించిన షేక్ సజ్జాద్ గుల్ గతంలో లష్కరే తోయిబా కమాండర్‌గా పనిచేశాడు.
భారత ప్రభుత్వం 2023లో టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించింది. ఈ సంస్థ కశ్మీర్‌లో హిందువులు, ముస్లింలు, సిక్కులు, పండితులు అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలపై దాడులు చేసింది. 2020లో మొదట కుప్వారాలో పేరు వెలుగులోకి వచ్చి, తర్వాత కుల్గాం, శ్రీనగర్, పుల్వామా, గండేర్‌బల్‌లో పలు ఘోర దాడులకు పాల్పడింది.