OTT Movie: ఇప్పుడు వెబ్ సీరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఎంటర్టైన్మెంట్ కోసం వీటినే ఎక్కువగా చూస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళ రొమాంటిక్-కామెడీ వెబ్ సిరీస్, ఒక ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. ఈ సీరీస్ మధ్యతరగతి కలలు, వాస్తవికత మధ్య పోరాటం అని చెప్పుకోవచ్చు. ఇంటిని నిర్మించుకోవడానికి ఈ జంట ఎదుర్కునే సవాళ్ళు, ఈ స్టోరీ లో ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఈ వెబ్ సీరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
డిస్నీ+ హాట్‌స్టార్ (Disney + hotstar) లో
ఈ మలయాళ రొమాంటిక్ కామెడీ వెబ్ సీరీస్ పేరు ‘లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్’ (Love Under Construction). దీనికి విష్ణు జి. రాఘవ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో నీరజ్ మాధవ్, గౌరీ జి. కిషన్, అజు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించారు. వినోద్ అనే యువకుడి చుట్టూ ఈ సీరీస్ తిరుగుతుంది. ఇది ఆరు ఎపిసోడ్‌లతో కూడిన సిరీస్. ప్రతి ఎపిసోడ్ సుమారు 30 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 28, 2025న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney + hotstar) లో విడుదలైంది. మలయాళంతో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
వినోద్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ, తన కుటుంబం కోసం కేరళలో ఒక ఇంటిని నిర్మించాలని కళలు కంటూ ఉంటాడు. అక్కడే అతను గౌరీ అనే అమ్మాయిని కలుసుకుంటాడు. వారు కొద్ది రోజుల్లోనే ప్రేమలో కూడా పడతారు. అయితే, వినోద్ ఊహించని విధంగా దుబాయ్‌లో తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. దీంతో అతని ప్రణాళికలు తలకిందులవుతాయి. ఇంటి నిర్మాణం కోసం డబ్బు సమస్యలు తలెత్తుతాయి. అదే సమయంలో గౌరీతో పెళ్లి చేసుకోవాలనే అతని ప్రయత్నానికి, ఇరు కుటుంబాల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. రిజిస్టర్డ్ మ్యారేజ్ కూడా అనుకున్నంత సులభం కాదని తెలుస్తుంది. ఒక్కసారిగా ఇన్ని సమస్యలు రావడంతో, వినోద్ చాలా ఇబ్బందులు పడతాడు.
ఈ సమస్యలను వినోద్ ఎలా ఎదుర్కొంటాడు? తన కలల ఇంటిని పూర్తి చేయగలుగుతాడా? తన ప్రేమను కాపాడుకోవడానికి ఎలాంటి సవాళ్లను అధిగమిస్తాడు? అనేది కథ లో ఆసక్తికరంగా మారుతుంది. ఈ ప్రయాణంలో అతని కజిన్ పాప్పెట్టన్ వినోద్ కి సహాయం చేస్తూ, కామెడీ, భావోద్వేగ క్షణాలతో కథను ముందుకు తీసుకెళ్తాడు. వినోద్ జీవితంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిళ్లు, ప్రేమ మధ్య సంఘర్షణ. చివర్లో ఊహించని ట్విస్ట్, ఇది సిరీస్‌కి ప్రత్యేకతను జోడిస్తుంది. మొత్తంగా ‘లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్’ ఒక ఆహ్లాదకరమైన, భావోద్వేగపరమైన రొమ్-కామ్ సిరీస్‌గా నిలుస్తుంది. మీరుకూడా ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సీరీస్ ను చూడాలి అనుకుంటే , ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney + hotstar) లో అందుబాటులో ఉంది. మరెందుకు ఆలస్యం ఈ మలయాళ వెబ్ సీరీస్ పై ఓ లుక్ వేయండి.