April Release Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈరోజు మధ్య సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో సినిమాలు చాలా వరకు యావరేజ్ టాక్ ను అందుకొనేవి. కానీ ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. ఓటీటీలో ఒకవైపు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న కూడా థియేటర్లలో సినిమాలు చూసేందుకు యువత ఆసక్తి కనబరుస్తున్నారు.. అందుకే ప్రతినెల బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ నెలలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
Also Read :కామెడితో మెంటలెక్కిస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’.. కలెక్షన్ల సునామీ.
స్టార్స్ తో సంబంధం లేకుండా ఇప్పుడు కేవలం సినిమా టిక్కెట్ కు పెట్టిన డబ్బులకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ నెలలో ఏకంగా 19 సినిమాలు రిలీజ్ అవుతుండటం మామూలు విషయం కాదు. అందులో కొన్ని సినిమాలపై పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యాయి. కన్నప్ప, భైరవం, ఘాటీ చిత్రాల పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 20 తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాల పై ఆసక్తి కనబరుస్తున్నారు.. ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే..?
ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్..
ఏప్రిల్ 4..
శారీ
వృషభ
లెవల్
ఆదిత్య 369
28 C
సీతన్న పేట్ గేట్
ఏప్రిల్ 10..
జాక్
జాట్
అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి – ఏప్రిల్ 11
ఓదెల 2 – ఏప్రిల్ 17
ఏప్రిల్ 18..
మధురం
ఘాటీ
చౌర్య పాఠం
సారంగపాణి
మ్యాజిక్
ఏప్రిల్ 25..
కన్నప్ప
భైరవం
ఎర్రచీర
భద్ర కాళీ – ఏప్రిల్ 30
రామ్ గోపాల్‌వర్మ నిర్మాణంలో కొత్తగా రూపొందుతున్న చిత్రం శారీ . మూడు నాలుగేండ్ల క్రితం సోషల్ మీడియా రీల్స్‌తో ఫేమస్ అయిన కేరళ బ్యూటీ ఆరాధ్యదేవి ని కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ మూవీ ఏప్రిల్ 4న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
యాక్టర్ మోహన్ లాల్ ప్రస్తుతం ఓ వృషభ అనే భారీ బడ్జెట్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు.. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ మూవీని శోభా కపూర్, ఏక్తా కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు. తొమ్మిదేళ్ల కిందటి నుంచే దీన్ని ప్లాన్ చేస్తున్నానని విష్ణు స్వయంగా చెప్పాడు. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.. ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఇందులో నటిస్తున్నారు. కానీ ఏం లాభం.. సినిమాకు మాత్రం బజ్ రావట్లేదు. ఎంత చేసినా.. ఏం చెప్పినా సినిమా మీద నెగెటివ్ వైబ్స్, ట్రోల్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు. చివరకు ప్రభాస్ ఉన్నాడు అనే ఒక చిన్న హోప్ తప్ప.. సినిమాకు ప్రత్యేకించి వస్తున్న పాజటివ్ వైబ్స్ ఏమీ లేవు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో ఈరోజు మూవీ రాబోతుంది..
వీటితోపాటు అనుష్క నటించిన ఘాటీ, బాలయ్య ఆదిత్య 369 సినిమాల పై భారీ హైప్ ఉంది. మరి చూస్తుంటే ఏప్రిల్ లో చిన్న సినిమాల మధ్య టఫ్ పోటీ జరగబోతుంది. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే థియేటర్లలోకి వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..