Vitamin E: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, పోషకాలు చాలా ముఖ్యం. వివిధ రకాల విటమిన్లు జీవక్రియలు సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. వీటిలో విటమిన్ ఇ కూడా ఒకటి. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉంటుంది. మరి విటమిన్ ఇ శరీరానికి ఎంత వరకు అవసరం. విటమిన్ ఇ లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన చర్మం:
విటమిన్ ఇ చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా ముఖంపై ముడతలను తగ్గించడంలో మేలు చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ సమస్యను తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.
పొడవాటి జుట్టు:
విటమిన్ E తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దీని యొక్క శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు.. ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించడానికి అంతే కాకుండా తలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. తద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
మానసిక ఆరోగ్యం:
వృద్ధాప్యంతో.. మీ మెదడు సామర్థ్యం బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీనిని అభిజ్ఞా క్షీణత అంటారు. దీని కారణంగా.. మీ జ్ఞాపకశక్తి బలహీనపడటం, అల్జీమర్స్, చిత్తవైకల్యం వంటి సమస్యలు వస్తాయి. కానీ విటమిన్ ఇ తీసుకోవడం ద్వారా మీరు ఈ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
మెరుగైన మానసిక స్థితి:
విటమిన్ E న్యూరాన్‌లను ఆక్సీకరణ సమస్యల నుండి రక్షించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం మెదడు ఆరోగ్యానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
గుండె పనితీరు:
విటమిన్ E తగినంత తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా రక్త ప్రసరణను సక్రమంగా జరిగేలా చేస్తుంది. విటమిన్ ఇ ద్వారా కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
Also Read: ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ? ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు అలా చెయ్యరు
రోగనిరోధక శక్తి:
విటమిన్ ఇ శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతే కాకుండా ఇది బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా.. రొమ్ము క్యాన్సర్‌ను నివారించడంలో అలెర్జీలను నివారించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.