BigTV English

Soan papdi Sweet: ఓడియమ్మ.. దీపావళికి సోన్ పాపిడి గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఇదేనట!

Soan papdi Sweet: ఓడియమ్మ.. దీపావళికి సోన్ పాపిడి గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఇదేనట!
Advertisement

దేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ రోజు ఇళ్లన్నీ దీపాల వెలుగుల్లో కలర్ ఫుల్ గా కనిపించడంతో పాటు టపాకాయల మోతలతో అందరిలో ఉత్సాహం నెలకొంటుంది. బంధుమిత్రులతో పాటు ఇరుగు పొరుగు వాళ్లంతా రుచికరమైన పిండి వంటకాలు తయారు చేసుకుంటారు. నోటిని తీపి చేసే రకరాల స్వీట్లను బహుమతులుగా ఇచ్చుకుంటారు. జిలేబీ, పాలకోవా, మైసూర్ పాక్, కలాకండ్, మోతీచోర్ లడ్డూ లాంటి స్వీట్లు పంచుకుంటారు. వీటితో పాటు దీపావళి స్వీట్లలో సోన్ పాపిడికి ప్రత్యేక స్థానం ఉంది. చూడ్డానికి అందంగా కనిపించడంతో పాటు చక్కటి రుచితో ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీపావళి గిఫ్ట్ లలో సోన్ పాపిడి కచ్చితంగా ఉంటుంది. ఇంతకీ దిపావళి రోజున ఈ స్వీట్ ను ఎందుకు బహుమతిగా ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..


హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం

హిందూ సంప్రదాయంలో స్వీట్లు సంతోషం, శ్రేయస్సు, లక్ష్మీ దేవి ఆశీస్సులను సూచిస్తాయి. దీపావళి పర్వదినం రోజున  స్వీట్లు పంచడం శుభప్రదమైన పనిగా భావిస్తారు. స్వీట్ల పంపిణీ అనేది సామాజిక బంధాలను బలోపేతం చేస్తుంది. సోన్ పాపిడి, గ్రామ్ ఫ్లోర్, చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ తో తయారు చేస్తారు. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతగానో ఇష్టపడుతారు.

తక్కువ ధరలో దొరికే స్వీట్ గా గుర్తింపు

సోన్ పాపిడి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. కిలో సుమారు రూ. 300 వరకు పలుకుతుంది. నిల్వ సామర్థ్యం కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అందుకే, ఈ స్వీట్లను మధ్యతరగతి కుటుంబాలు అనువైన ఎంపికగా భావిస్తాయి. రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఈ స్వీట్ అన్ని సీజన్లలో ఎక్కువగా అమ్ముడు అవుతుంది. దీపావళి వేళ అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే స్వీట్ గా గుర్తింపు తెచ్చుకుంది.


సోన్ పాపిడి మీద బోలెడు జోకులు

సోన్ పాపిడి ఇష్టమైన స్వీట్ మాత్రమే కాదు, దీని మీద ఎన్నో జోకులు కూడా ఉన్నాయి. ఈ స్వీట్ తక్కువ ధరలో లభించడం వల్ల చాలా మంది దీపావళికి గిప్టులుగా ఇచ్చుకుంటారు. అయితే, ఈ స్వీట్లను రీగిఫ్టింగ్ చేయడం అనేది జోక్స్ కు కారణం అయ్యింది.ఒకరు అందుకున్న సోన్ పాపిడి బాక్స్ ను మరొకరికి ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. ఎవరూ తినని, అందరూ ఇచ్చే స్వీట్‌ గా కామెడీ ఇమేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ స్వీట్ మీద వైరల్ మీమ్స్ వచ్చాయి. ‘Make Soan Papdi Great Again’ లాంటి యాడ్ కాంపెయిన్ లతో ఈ కామెడీ మరింత పెరిగింది. జెడ్ జెన్ ఈ సంప్రదాయ స్వీట్లను అవుట్‌ డేటెడ్ స్వీట్స్ గా చూస్తుంది. అయినప్పటికీ, సోన్ పాపిడి అమ్మకాలు రోజు రోజుకు బాగా పెరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఈ స్వీట్ ఎక్కువగా అమ్ముడు అవుతుంది. ఇది కెమికల్ ఫ్రీ స్వదేశీ స్వీట్ కావడంతో సేఫ్ ఆప్షన్‌గా భావిస్తారు.

Read Also:  దీపావళిని ఏయే రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారో తెలుసా? ఒక్కోచోట ఒక్కో సాంప్రదాయం!

Related News

Garlic: చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా తింటే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు !

Intimacy Boost: ఏంటీ.. చలికాలంలో ఆలుమగలు అలా కలిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందా? సైన్స్ ఏం చెబుతోందంటే?

Waking Up: మధ్య రాత్రి మెలకువ వస్తోందా? అసలు కారణాలివే !

Breakfasts: మార్నింగ్ ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తింటే.. రోజంతా ఫుల్ ఎనర్జీ

Spinach: పాలకూరతో పాటు.. ఇవి అస్సలు తినొద్దు !

Health Risks: పండగ సమయంలో నోటిని అదుపు చేసుకోలేకపోతున్నారా ? ఇలా చేయకుంటే సమస్యలు తప్పవు

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గించే.. బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసా ?

Big Stories

×