BigTV English

Thalapathy 69: నేలకొండ భగవంత్ కేసరి రీమేక్.. ఏ టైటిల్ తో వస్తుందో తెలుసా.. ?

Thalapathy 69: నేలకొండ భగవంత్ కేసరి రీమేక్.. ఏ టైటిల్ తో వస్తుందో తెలుసా.. ?

Thalapathy 69: ఇండస్ట్రీలో రీమేక్ లు కొత్తేమి కాదు. తెలుగు హీరోల సంగతి పక్కన పెడితే..  తమిళ్ హీరోల్లో రీమేక్ రాజా ఎవరు అంటే టక్కున దళపతి విజయ్ అని చెప్పేస్తారు. అక్కినేని నాగార్జున సినిమా నుంచి.. మహేష్  సినిమాల వరకు ఎన్నింటినో ఆయన రీమేక్ చేసి మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక  గత కొన్నేళ్లుగా విజయ్ కు లక్ అస్సలు కలిసిరావడం లేదు. ప్రేక్షకులకు ఒక మంచి హిట్ ఇచ్చి.. తన సినిమా కెరీర్ కు ముగింపు పలకాలని చూస్తున్నా కూడా విజయ్ కు కుదరడం లేదు.


బీస్ట్, వారసుడు, లియో, ది గోట్ ఇలా ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే వస్తున్నాయి.  దీంతో తన రాజకీయ  కెరీర్ ను మొదలుపెట్టేలోపు.. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలని ఎంతో కసిగా ఉన్నాడు విజయ్. అందుకే తనకు అచ్చి వచ్చిన రీమేక్ నే నమ్ముకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం దళపతి 69.  హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన  నేలకొండ భగవంత్ కేసరికి రీమేక్.

Allu Aravind: స్టేజిపై అమ్మాయితో అల్లు అరవింద్ డ్యాన్స్.. వీడియో వైరల్


అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. గుడ్ టచ్.. బ్యాడ్  టచ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ను అందించారు. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించగా.. కాజల్  హీరోయిన్ గా నటించింది. ఇక విజయ్ సినిమాలో.. శ్రీలీల పాత్రలో మమితా బైజు నటిస్తుండగా.. కాజల్ ప్లేస్ ను పూజా హెగ్డే రీప్లేస్ చేస్తుంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ గురించి వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు  రేపటి తీర్పు అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ పెట్టడం వెనుక పెద్ద కథనే ఉందట. విజయ్ నటించిన తొలి సినిమా పేరు కూడా రేపటి తీర్పునే. ఇక ఈ సినిమా  విజయ్ చివరి చిత్రం దీంతో.. దీనికి కూడా ఆ టైటిల్ పెడితే బావుంటుందని అనుకోని విజయ్ రేపటి తీర్పు అనే టైటిల్ ను పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.

వినడానికి కొంచెం గమ్మత్తుగా ఉన్నా.. అదే నిజమని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అందులోనూ విజయ్ ఫ్యాన్స్ కు సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని అంటున్నారు. ఇక  టైటిల్ కి తగ్గట్టే కథ తమిళ్ నేపధ్యానికి తగ్గట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో విజయ్ చివరి చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×